Viral Video: ఫ్లైట్ ఆలస్యమైందని.. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఏం చేశారంటే..

విమానం ఆలస్యమైతే ప్యాసింజర్స్ అస్సలు ఒప్పుకోరు. తాము నిమిషం లేటుగా వచ్చినా ఆపేస్తారు కదా.. మరి ఇప్పుడు ఏం చేస్తారంటూ సంబంధిత ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ గోవా ఎయిర్‌పోర్ట్‌లో విభిన్నమైన సీన్ జరిగింది. ... .. ..

Viral Video: ఫ్లైట్ ఆలస్యమైందని.. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఏం చేశారంటే..
Garba At Goa Airport

Updated on: Sep 30, 2025 | 1:56 PM

సాధారణంగా విమానం ఆలస్యమైతే ప్రయాణికులు ఆగ్రహానికి లోనవుతారు. సదరు విమాన సంస్థ సిబ్బందిని ఏకిపడేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఆలస్యంగా కారణంవగా వేచి ఉన్న.. ప్రయాణికులు గర్బా నృత్యంతో కాలక్షేపం చేసారు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక ఫ్లైట్ గోవా నుంచి సూరత్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ పైలట్ అస్వస్థతకు లోనవడంతో.. విమానం ఆలస్యమయిందని NDTV తెలిపింది. ఈ సమాచారం తెలుసుకున్న ప్రయాణికుడు మయూర్.. సూరత్‌లో జరిగే గర్బా ఫంక్షన్‌లో పాల్గొనలేనందుకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశా3డు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇండిగో సిబ్బంది అతడ్ని సముదాయించేందుకు తమదైన ప్రయత్నం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో స్పీకర్‌లు ఏర్పాటు చేసి.. అక్కడున్న ప్రయాణికులకు గర్బా ఆడేందుకు అవకాశాన్ని ఇచ్చారు. ప్యాసింజర్స్ మాత్రమే కాక, అక్కడి సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు.

సోషల్‌ మీడియాలో కొందరు ఈ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత అది వైరల్‌గా మారింది. “విమాన ఆలస్యమైందని మొదట నిరుత్సాహంగా ఉన్నప్పటికీ, గర్బా నృత్యాన్ని ఆస్వాదించగలిగినందుకు ఇది మరచిపోలేని రోజు అయ్యింది” అని తెలిపారు. అయితే ప్రయాణీకుల రద్దీ ఉంటే ఎయిర్‌పోర్ట్‌లో ఈ తరహా వ్యవహారం కరెక్ట్ కాదని కొందరు తిట్టిపోస్తున్నారు.  ఈ వేడుకలు విమానాశ్రయ మర్యాదను దెబ్బతీశాయని ఆరోపిస్తున్నారు.