మీతో బాటే నేనూ డ్యాన్స్ చేస్తా.. అందాల చిలకమ్మ జోష్

|

Oct 26, 2019 | 6:32 PM

బ్రెజిల్ లో ఈ మధ్య ఓ పార్టీ సందర్భంగా అంతా సందడిగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. అక్కడే ఓ గోడ మీద వయ్యారంగా వాలిన అందాల చిలక.. అది చూసి తానూ ఉండబట్టలేకపోయింది. ఆ సాంగ్ కి అనుగుణంగానా అన్నట్టు కాళ్ళు కదిలిస్తూ, తల అటూఇటూ ఆడిస్తూ ఫుల్ జోష్ తో ఊగిపోయింది. ఇది చూసిన యువకులు ఆనందంతో… రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొడుతూ డ్యాన్స్ జోరు పెంచారు. ఈ నెల 20 న జరిగిన […]

మీతో బాటే నేనూ డ్యాన్స్ చేస్తా.. అందాల చిలకమ్మ జోష్
Follow us on

బ్రెజిల్ లో ఈ మధ్య ఓ పార్టీ సందర్భంగా అంతా సందడిగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. అక్కడే ఓ గోడ మీద వయ్యారంగా వాలిన అందాల చిలక.. అది చూసి తానూ ఉండబట్టలేకపోయింది. ఆ సాంగ్ కి అనుగుణంగానా అన్నట్టు కాళ్ళు కదిలిస్తూ, తల అటూఇటూ ఆడిస్తూ ఫుల్ జోష్ తో ఊగిపోయింది. ఇది చూసిన యువకులు ఆనందంతో… రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొడుతూ డ్యాన్స్ జోరు పెంచారు. ఈ నెల 20 న జరిగిన ఈ ‘ చిలకమ్మ పార్టీ ‘ ఇలా కొంతసేపు రంజుగా సాగిపోయింది. ఈ వీడియోను సుమారు 30 లక్షల మంది వీక్షించి.. ఎంజాయ్ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. అది పెంపుడు చిలకయితేనేం.. మంచి ‘ డ్యాన్సర్ ‘ కూడా అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెజిల్ రాజధాని రీడీజెనీరోలో అంతా ఇప్పుడు ఈ ‘ రామ సక్కని సిలకమ్మ ‘ గురించే చెప్పుకుంటున్నారట.