
ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు తమ ఇంట్లో జాగా లేకపోవడంతో.. టూ వీలర్స్‌ను బయట పార్క్ చేస్తుండటం జరుగుతోంది. ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే పర్లేదు గానీ.. ఇలా ఎండ, వాన అనేది తేడా లేకుండా తమ టూ వీలర్ వెహికిల్స్‌ను ఇంటి బయటే పార్క్ చేస్తున్నారో.? వారికి ఓ అలెర్ట్. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బయటకు వెళ్లేందుకు తన ఇంటి బయట పార్క్ చేసిన స్కూటీని స్టార్ట్ చేయబోయాడు. ఈలోగా వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయోనని చెక్ చేయగా.. బ్రేకుల మధ్యలో ఏదో నల్లటి ఆకారం కదులుతూ కనిపించింది. ఏమై ఉంటుందా అని చూడగా.. దెబ్బకు గుండె గుభేలంది. భారీ నాగుపాము చుట్టుకుని దర్శనమిచ్చింది. దీంతో సదరు వ్యక్తి వెంటనే సమాచారాన్ని స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్‌కు అందించాడు. అతడు అక్కడికి చేరుకొని బుసులు కొడుతున్న నాగుపాము అతికష్టం మీద బంధించాడు. ఇక దీని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటన రాజస్థాన్‌లో చేసుకుంది.