Optical illusion: ఓపెన్ ఛాలెంజ్.. పింక్ సర్కిల్‌లో అద్భుతం దాగి ఉంది.. కనిపెడితే ఖతర్నాకే..

Optical illusion: ఓ టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన ఆప్టికల్ ఇల్యూజన్ పిక్ ఒకటి నెటిజన్‌లను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది.

Optical illusion: ఓపెన్ ఛాలెంజ్.. పింక్ సర్కిల్‌లో అద్భుతం దాగి ఉంది.. కనిపెడితే ఖతర్నాకే..
Optical Illusion

Updated on: Aug 02, 2022 | 5:47 PM

Optical illusion: ఓ టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన ఆప్టికల్ ఇల్యూజన్ పిక్ ఒకటి నెటిజన్‌లను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. అది చూసిన వారికి తమ కంటిచూపు మందగించిందా? అనే సందేహంతో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే.. ఇది సామాన్య దృష్టితో చూస్తే కనిపించే రహస్యం కాదు. కళ్లతో పాటు.. బుర్ర కూడా పెట్టి చూడాల్సిన పిక్ అది. అలా అయితే, ఆ ఆప్టికల్ పిక్‌లోని రహస్యాన్ని కనిపెట్టగలరు. ఇప్పటి వరకు దీనిని కేవలం 1 శాతం మంది మాత్రమే కనిపెట్టగలిగారు.. చాలా మంది ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు.

@pasillusion యూజర్ ఒక ఆప్టికల్ ఇల్యూజన్ పిక్‌ను షేర్ చేశారు. ఇందులో లేత గులాబీ రంగులో ఉన్న చతురస్రంలో.. ముదురు పింక్ కలర్‌లో వృత్తం ఉంది. ఆ వృత్తంలోనే రహస్యంగా ఓ అద్భుత దృశ్యం దాగి ఉంది. ఆ రహస్య పిక్ ఏంటో కనిపెట్టాలంటూ సవాల్ విసిరారు. అయితే, ఇప్పటి వరకు దీనిని కేవలం 1 శాతం మంది మాత్రమే కనిపెట్టారు. చాలా మంది దీనిని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. వాస్తవానికి దీనిని కనిపెట్టడం చాలా ఈజీనే. అయితే, కాస్త ఓపిక, సహనం అవసరం. సహనం ఉంటే.. ఎంత కష్టమైనా ఈజీగా విజయం సాధించొచ్చు అని పెద్దలు కూడా అంటారు. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ విషయంలో సరిగ్గా ఇదే నిజమవుతుంది.

అయితే, @pasillusion ఇతని ఛాలెంజ్‌ను స్వీకరించిన పలువురు.. తమకు కనిపించిన రూపాలను ప్రస్తావించారు. కొందరు దానిని మంచం, పడవ, చతురస్రాకారంలో ఉన్న యంత్రం, నుటెల్లా కూజా వంటి వస్తువుల పేర్లు చెప్పకొచ్చారు. కానీ, చాలా మంది దానిలో ఒక బాటిల్ దాగుందని పేర్కొంటున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..