Optical Illusion: మీ బుర్రకు పదును పెడితే ఇట్టే కనిపెట్టెస్తారు.. ఈ చిత్రంలో గుర్రం దాగుంది.. 15 సెకన్లే టైం..

|

Aug 02, 2022 | 6:10 AM

తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో దాగున్న గుర్రాన్ని 15 సెకన్లలోపు కనుగొనవలసి ఉంటుంది. అలా చేస్తే మీరు జీనియస్ అంటూ పేర్కొంటున్నారు.

Optical Illusion: మీ బుర్రకు పదును పెడితే ఇట్టే కనిపెట్టెస్తారు.. ఈ చిత్రంలో గుర్రం దాగుంది.. 15 సెకన్లే టైం..
Optical Illusion
Follow us on

Optical Illusion Test: సోషల్ మీడియా వేదికగా నిత్యం అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు కూడా ఉంటాయి. ఇవి మన మెదడుకు మేతలా పనిచేస్తాయి. అంతేకాకుండా టైంపాస్‌గా, సరదాగా స్నేహితులను ఆటపట్టించేందుకు ఉపయోగపడతాయి. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో దాగున్న గుర్రాన్ని 15 సెకన్లలోపు కనుగొనవలసి ఉంటుంది. అలా చేస్తే మీరు జీనియస్ అంటూ పేర్కొంటున్నారు. అందుకోసం దిగువన ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని చూడండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌ను సవాల్‌గా తీసుకుంటే.. ఇట్టే కనిపెడతారు. అయితే.. ఈ గుర్రాన్ని 15 సెకన్లలోపే కనుగొనాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..

ఈ చిత్రంలో ఒక అందమైన ఇల్లు, పక్కనే మరో షెడ్, చెట్టు కనిపిస్తుంది. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక దుకాణం కూడా ఉన్నట్లు చూడవచ్చు. ఇది పురాతన వస్తువుల దుకాణంలా ఉంది. దుకాణం బయట పార్క్ చేసిన కార్లను కూడా నిశితంగా పరిశీలించండి..

Viral

చిత్రంలో గుర్రాన్ని గుర్తించారా? లేదా..? గుర్తించకపోతే మరోసారి గుర్రాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక రకమైన విజువల్ టెస్ట్ లేదా మైండ్ టీజర్. ఇక్కడ మీరు గుర్రాన్ని సాదాసీదాగా చూడలేరు. ఇది అంత తేలికైన పనికాదు.. ఇంకా గుర్తించకపోతే.. ఈ సూచనల ద్వారా గుర్రాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేస్తాం.. గుర్రం కనుచూపు మేరలో కనిపిస్తుంది. చిత్రం కింద నుంచి పై వరకు గుర్రాన్ని వెతకడానికి ప్రయత్నించండి. చిత్రంలో గుర్రం బహిరంగ ప్రదేశాల్లో కనిపించదు. గుర్రం ఇంటి లోపల కనిపిస్తుంది చూడండి.. ఇప్పుడు మీరు గుర్రాన్ని కనుగొన్నారని ఆశిస్తున్నాము.

ఇవి కూడా చదవండి

ఇంకా గుర్రాన్ని కనుగొనని వారుంటే.. ఇక్కడ కింద ఇచ్చిన ఫొటోను ఒకసారి చూడండి.. గుర్రం తెల్లటి రంగులో ఉండి కిటికీలోంచి చూస్తోంది.

Optical Illusion Test

మీరు కూడా స్నేహితులను ఆటపట్టించాలనుకుంటే.. దీనిని షేర్ చేసి ఎంజాయ్ చేయండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.