Viral Optical Illusion: చిన్న సమస్యలను కూడా భూతద్ధంలో చూసే మైండ్ సెట్‌కు పుల్ స్టాప్ పెట్టాలంటే.. మనోనేత్రాలు షార్ప్‌గా ఉండాలి. అవును.. సమస్యను ఎలా చూస్తాం, దానిని ఎలా పరిష్కరిస్తాం అనే దానిపై మన విజ్ఞత ఆధారపడి ఉంటుంది. అందుకు బుర్రను పదునుపెట్టే పనులు అప్పుడప్పుడూ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీకోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ పెడుతున్నాం. ఈ పిక్చర్ నిండా ఒకేలా కన్పించే ఎల్లో కలర్ కివి బర్డ్స్ (పక్షులు) ఉన్నాయి. న్యూజిల్యాండ్‌లో ఈ రకం పక్షులు కన్పిస్తాయి. ఇవి సాధారణంగా ఎగురలేవు. అంటే నేలపైనే ఉంటాయన్న మాట. ఐతే వీటి మధ్యలో 4 కివి పండ్లు కూడా దాగి ఉన్నాయి. మీరు ఎంత షార్పో ఈ టెస్ట్ చెప్పేస్తుంది. ఎందుకంటే ఒకే ఒక్క నిముషంలో ఈ పిక్చర్‌ను చూసి ఆ నాలుగు కివి పండ్లు ఎక్కడున్నాయో కనిపెట్టెయ్యాలి. ఇదే టెస్ట్..!
ఈ ఛాలెంజ్‌ను తీసుకున్న అనేక మంది సమాధానం కనుక్కోలేక తలలు గోక్కుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పిక్చర్ వైరల్ అయ్యింది. నిజానికి ఆప్టికల్ ఇల్యూషన్లనేవి భ్రమలను కలిగిస్తాయి. ఎలాగంటే మనం చూసే పిక్చర్‌లో కనిపించేవన్నీ ఒకే రూపంలో ఉన్నయన్న భ్రమ మన మెదడులో బలంగా కలిగేలా చేస్తాయి. ఈ ఛాలెంజ్‌ను సరదాగా తీసుకుని మీకు కూడా ప్రయత్నించండి. ఒక వేళ కనుక్కోలేకపోతే ఈ కింది చిత్రంలో కొంచెం క్లియర్‌గా కన్పిస్తుంది. ప్రయత్నించండి.
ప్చ్! ఐనా కనుక్కోలేకపోతున్నారా? ఐతే ఈ కింది చిత్రం చూడండి. మీకు ఆన్సర్ దొరుకుతుంది..