
చిత్రం.. మిమ్మల్ని మాయ చేసే కనికట్టు చిత్రం.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ మాత్రం ఉన్నాయో కనిపెట్టే చిత్రం.. మిమ్మల్ని తికమక పెట్టి.. పరీక్ష పెట్టే చిత్రం.. మీ ముందుకు ఓ విభిన్నమైన ఫోటో పజిల్ తీసుకొచ్చాం. ఇది మీ ఐ ఫోకస్ ఏ మాదిరిగా ఉందో చెప్పేస్తుంది.. మీ బుర్ర ఎంత యాక్టివ్‌గా వర్క్ అవుతుందో వివరిస్తుంది. కొందరు చాలా సెల్ఫ్ కాన్సిడెన్స్‌తో ముందుకు సాగుతుంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. స్కిప్ చేయకుండా దాని లెక్క తేలుస్తారు. చిన్న, చిన్న పజిల్స్ సాల్వ్ చేయలేకపోతే.. ఇక పెద్ద టాస్కులు వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఛాలెంజ్‌లు స్వీకరించేవారు సోషల్ మీడియాలో కనిపించినప్పుడు అస్సలు లైట్ తీసుకోరు. కొద్దిగా లేటు అయినా దాని పని పట్టేస్తారు.
అలాంటివారి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ తీసుకొచ్చాం. ఇది క్రియేట్ చేసిన ఫోటో కాదు. ఒరిజినల్‌గా తీసిన ఫోటో. ఒక చిన్న తొట్టిలో రోజుల వయస్సున్న క్యూట్ కుక్క పిల్లలు ఉన్నాయి. అవి ఒకదానిపై ఒకటి బొజ్జుని ఉన్నాయి. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే.. అక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పాలి. ఒక నిమిషంలోపల అక్కడ ఎన్ని కుక్క పిల్లలు ఉన్నాయో చెప్తే మీరు గ్రేట్ అంతే. కొంచెం ఫోకస్ పెట్టి చూస్తే.. సమాధానం సలభంగానే చెప్పేయవచ్చు.
ఓ ఆన్సర్ మీరు అనుకున్నారా. అయితే ఫైన్. సమాధానం ఉన్న ఇమేజ్ మేం దిగువన ఇస్తాం. మీ ఆన్సర్ కరెక్టో, కాదో తెలుసుకోండి. తప్పైనా నో వర్సీస్. మీరు ప్రయత్నం చేశారు. అది గొప్ప విషయం. అసలు ట్రై కూడా చేయకుండా.. సమాధానం చూస్తే మీరు లేజీ ఫెల్లోస్ అనుకోవాలి. ఏదైతేనేం.. ఈ పజిల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అనుకుంట. మరో క్రేజీ పజిల్‌తో మళ్లీ కలుద్దాం. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే.. అక్కడ 10 కుక్క పిల్లలు ఉన్నాయ్. దిగువ ఫోటోలో చూడండి.
Puppies