optical illusion: ఛాలెంజ్‌కి సిద్ధమా.? ఈ ఫొటోలో ‘E’ కనిపెట్టండి చూద్దాం..

|

Jun 24, 2024 | 2:31 PM

ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో కొన్ని మన ఆలోచన విధానాన్ని అంచనా వేసేవి ఉంటాయి. వీటిని పర్సనాలిటీ టెస్ట్‌గా పిలుస్తుంటారు. ఇందులో మీరు ఒక ఫొటోను చూసే విధానంగా ఆధారంగా మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు. ఇక మరో రకం ఫొటో పజిల్స్.. చూసే కళ్లను మాయ చేసే ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో మంచి కిక్ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట...

optical illusion: ఛాలెంజ్‌కి సిద్ధమా.? ఈ ఫొటోలో E కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us on

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా కంటిచూపుతో పాటు ఆలోచన శక్తిని పరీక్షించే ఫొటోలకు నెటిజన్లు తెగ ఆకర్షితులవుతువున్నారు. ఒకప్పుడు సండే మ్యాగజైన్స్‌లో వచ్చే ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేసేవారు. కానీ ఎప్పుడైతే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి.

ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో కొన్ని మన ఆలోచన విధానాన్ని అంచనా వేసేవి ఉంటాయి. వీటిని పర్సనాలిటీ టెస్ట్‌గా పిలుస్తుంటారు. ఇందులో మీరు ఒక ఫొటోను చూసే విధానంగా ఆధారంగా మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు. ఇక మరో రకం ఫొటో పజిల్స్.. చూసే కళ్లను మాయ చేసే ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో మంచి కిక్ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా పజిల్. ఇప్పుడు తెలుసుకుందాం..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది.. ఇంగ్లిష్‌ ఆల్ఫాబెట్ ‘F’ అని అంటారు కదూ! అయితే వాటి మధ్యలోనే ‘E’ అక్షరం కనిపిస్తోంది. దానిని కనిపెట్టడమే ఈ పజిల్‌ ముఖ్య ఉద్దేశం. కేవలం 10 సెకండ్లలో పజిల్‌ను సాల్వ్‌ చేయగలిగితే మీ ఐ పవర్‌కి ఇక తిరుగే లేదని అర్థం. మీ ఆలోచన విధానం చాలా వేగంగా ఉంటుంది. అయితే ఇందులో ‘E’ లెటర్‌ను కనిపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఈ రెండు అక్షరాలు ఒకేలా పోలి ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

ఇంతకీ ఈ ఫొటో పజిల్‌ను మీరు సాల్వ్‌ చేశారా.? లేదా.? ఓసారి ఫొటోను తీక్షణంగా గమనించండి సమాధానం మీకే కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించిన కనిపించకపోతే ఓసారి మూడో లైన్‌ను తీక్షణంగా గమనించండి. అందులో చివరి నుంచి రెండో స్థానంలో మీరు వెతుకుతున్న ‘E’ లెటర్‌ కనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..