ఆప్టికల్ ఇల్యూజన్ సంబంధిత పజిల్స్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో మెదడుకు మేత పేట్టేవి కొన్ని అయితే, కళ్ల పవర్‌ను చెక్ చేసేవి మరికొన్ని. ఇలాంటి వాటికి నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తు్న్న నేపథ్యంలో క్రియేటర్లు సైతం రకరకాల ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను రూపొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఓ మైదానంలో గొర్రెల గుంపు ఉన్నట్లు కనిపిస్తోంది కదూ! అవును నిజమే కానీ ఆ గొర్రెల్లో ఓ నక్క కూడా ఉంది కనిపెట్టగలరా.? అదేంటి గొర్రెల మధ్య నక్క చేరితే.. గొర్రెలు అక్కడ ఎలా ఉంటాయన్న ప్రశ్న మీకు వచ్చింది కదూ! అవును నిజమే అయితే ఆ నక్క నిజమైన నక్క కాదు. ఆర్టిఫిషియల్‌గా నక్క ఇమేజ్‌ను అందులో ఇన్‌సర్ట్ చేశారు. గొర్రెల మధ్య ఉన్న ఆ నక్కను గుర్తుపట్టాలని పజిల్‌ను విసిరారు.
ఇంకేముంది ఈ ఫొటో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇంతకీ మీకు ఆ నక్క కనిపించిందా.? 10 సెకండ్లలో కనిపెడితే మీ కళ్ల పవర్ సూపర్‌గా ఉన్నట్లు. ఏంటి.. ఎంత ప్రయత్నించినా కనిపించడం లేదా. అయితే ఓసారి ఫొటోను జూమ్ చేసి చూడండి. ఫొటోకి కుడివైపు పైన కార్నర్‌లో క్రీమ్ కలర్ గొర్రెల నడము బ్లూ అండ్ బ్లాక్ కలర్‌లో ఓ నక్క కనిపిస్తోంది చూశారా. హా.. అదేనండి ఆ నక్క. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా ఛాలెంజ్ విసరండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..