Viral Photo: నారింజ పండ్ల మధ్యన కర్భూజా ముక్క..10 సెకన్లలో కనిపెడితే మీవి డేగకళ్లే..

Optical Illusion: సోషల్‌ మీడియాలో నిత్యం వేలాది ఫొటోలు వైరలవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగానూ, ఇంట్రెస్టింగ్‌గానూ ఉంటాయి. మరికొన్ని ఫొటోలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. చూడడానికి సింపుల్‌గానే ఉన్నా వాటిలో ఏదో మర్మం దాగుంటుంది.

Viral Photo: నారింజ పండ్ల మధ్యన కర్భూజా ముక్క..10 సెకన్లలో కనిపెడితే మీవి డేగకళ్లే..
Viral Photo

Updated on: Sep 21, 2022 | 6:06 PM

Optical Illusion: సోషల్‌ మీడియాలో నిత్యం వేలాది ఫొటోలు వైరలవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగానూ, ఇంట్రెస్టింగ్‌గానూ ఉంటాయి. మరికొన్ని ఫొటోలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. చూడడానికి సింపుల్‌గానే ఉన్నా వాటిలో ఏదో మర్మం దాగుంటుంది. ఆప్టికల్‌ ఇల్యూషన్‌ అనే పేరుతో పిలువబడే ఇలాంటి ట్రిక్కీ ఫొటోలు ఇటీవల నెట్టింట్లో బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లు కూడా ఈ ఫొటో పజిల్స్‌ గుట్టు విప్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా తాజాగా మరొక ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. ఈ ఫొటోను నిశీతంగా గమనిస్తే తొక్క తీసి ఒలిచిన నారింజ పండు ముక్కలే కనిపిస్తాయి. అయితే వీటి మధ్య ఓ కర్భూజా పండు ముక్క కూడా ఉందండోయ్‌. కాగా 10 సెకన్లలో దానిని కనిపెడితే వాళ్లకు డేగ కళ్లు ఉన్నట్లే అంటున్నాడు ఈ ఫొటో పజిల్‌ను క్రియేట్‌ చేసిన డిజైనర్‌.

కాగా పజిల్స్‌ని సాల్వ్ చేయడంలో ఆసక్తి చూపే వారి ఐక్యూ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే, పజిల్స్ మన మెదడుకు పని చెబుతాయి. అలాగే మన దృష్టి స్థాయిని కూడా పెంచుతాయి. ఈక్రమంలోనే ఓ తెలివైన ఫొటో పజిల్‌ను మన ముందుకు తీసుకొచ్చాడు డిజైనర్‌. ఒలిచిన నారింజ ముక్కల మధ్య కర్భూజ ముక్కను ఉంచి 10 సెకన్లలో దానిని కనిపెట్టమని సవాల్‌ విసిరాడు. మరి ఈ ఆప్టికల్ భ్రమను ఛేదించారా? అయితే ఇక్కడ పజిల్‌ డిజైనర్‌ ఒక క్లూ కూడా ఇచ్చాడు. అదేంటంటే పజిల్ డిజైనర్లు వస్తువులను మూలల్లో లేదా మధ్యలో దాచిపెడతారట. మరి ఇప్పటికైనా ఈ ఆప్టికల్‌ పజిల్‌ని సాల్వ్‌ చేశారా? లేకపోతే కింది ఫొటో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..