Optical illusion: మీ కళ్లల్లో పవర్‌ ఉందా.? అయితే మీకే ఈ పరీక్ష.. ఈ ఫొటోలో రెండు పిల్లులున్నాయి గమనించారా.?

|

Sep 02, 2022 | 12:48 PM

Optical illusion: గతానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను సోషల్ మీడియా మళ్లీ కొత్తగా గుర్తు చేస్తోంది. గడిచిన కాలం నాటి విషయాలు, ఆటలకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌...

Optical illusion: మీ కళ్లల్లో పవర్‌ ఉందా.? అయితే మీకే ఈ పరీక్ష.. ఈ ఫొటోలో రెండు పిల్లులున్నాయి గమనించారా.?
Optical Illusion
Follow us on

Optical illusion: గతానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను సోషల్ మీడియా మళ్లీ కొత్తగా గుర్తు చేస్తోంది. గడిచిన కాలం నాటి విషయాలు, ఆటలకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇలా నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న వాటిలో ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఒకటి. ఒకప్పుడు ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు సండే మ్యాగైజ్‌లకు మాత్రమే పరిమితమయ్యేవి. దాంతో ఆదివారం వచ్చిందంటే చాలు పేపర్‌తో కుస్తీపడే వారు. కానీ ఇప్పుడు ఇప్పుడు కాలం మారింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి వార్తల వరకు అన్నింటికీ సోషల్‌ మీడియాలోనే అడ్డాగా మారిపోయింది.

ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. పైన డ్రాయింగ్ వేసిన ఫొటోను చూడగానే సహజంగానే ఓ ఇంట్లో ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నారు కదూ.! భర్త న్యూస్‌ పేపర్‌ చదువుతుండగా, భార్య కుర్చీలో కూర్చింది. వాళ్ల పాప బొమ్మతో ఆడుకుంటోంది. సహజంగా అయితే అందరికీ ఈ ఫొటోలో కనిపించేది ఇదే.. కానీ ఇందులో రెండు పిల్లులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.?

ఇవి కూడా చదవండి

అవును నిజమే పైన ఉన్న ఫొటోల్లో రెండు పిల్లులు నక్కి నక్కి చూస్తున్నాయి. ఓసారి గమనించండి.. అంత సింపుల్‌గా గుర్తిస్తే క్రియేటర్‌ గొప్పతనం ఏముంటుంది చెప్పండి. కనిపించడకుండా డ్రా చేశాడు కాబట్టే ఈ పిక్‌ ఆప్టికల్‌ ఇల్యూషన్‌లో బెస్ట్ ఫొటోగా నిలిచింది. ఓసారి న్యూస్‌ పేపర్‌ చదువుతోన్న వ్యక్తి కాళ్ల కింద చూడండి పడుకున్న పిల్లి కనిపిస్తోంది కదూ! మరి ఇంకొక్కటి ఎక్కడుందనేగా.. మహిళ ఒడిలోనే హాయిగా పడుకుంది. భలే ఉంది కదూ.. ఈ పిక్‌ చూశాక చిత్రకారుడి ట్యాలెంట్‌కు ఫిదా హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..