Viral Video: ఆన్‌లైన్‌లో ఆశగా ఆర్డర్ పెట్టిన మహిళ.. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ తెరిచి చూడగా

|

Dec 05, 2024 | 4:52 PM

డిస్కౌంట్లు.. అదిరిపోయే ఆఫర్లు.. ఈ రెండింటితో ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లు కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఒక్క క్లిక్‌తో ఇంటికే అన్ని వస్తుండటంతో అందరూ కూడా..

Viral Video: ఆన్‌లైన్‌లో ఆశగా ఆర్డర్ పెట్టిన మహిళ.. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ తెరిచి చూడగా
Representative Image
Follow us on

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంటి దగ్గర నుంచే ఒక్క క్లిక్‌తో బట్టల నుంచి ఖరీదైన ఫోన్ల వరకూ అన్నింటిని కొనేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌తో తక్కువ ధరకే ప్రొడక్ట్స్ రావడమే కాదు.. మోసాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఆ తరహ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఆభరణాల పెట్టె ఆర్డర్ పెట్టగా.. ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేయడంతో దెబ్బకు బిత్తరపోయింది. అందులో నగలకు బదులుగా ఉల్లిపాయలు వచ్చాయి. ఈ ఘటనను సదరు మహిళ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నిధి జైన్ అనే మహిళ అమెజాన్‌లో 3 నగల పెట్టెలను ఆర్డర్ చేసింది. రెండు ఆర్డర్లు సరిగ్గానే ఇంటికి రావడంతో.. మరో పార్శిల్‌లో నగలకు బదులు ఉల్లిపాయలు వచ్చాయి. దాన్ని చూసి బిత్తరపోయిన నిధి.. వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసింది. అయితేనేం ఆ కంపెనీ మాత్రం ఇప్పటిదాకా స్పందిచలేదట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది.

సదరు వీడియోను నవంబర్ 27న ఆ మహిళ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. వరుసపెట్టి వ్యూస్, కామెంట్స్‌తో నెటిజన్లు హోరెత్తించారు. ‘ఉల్లి ఇప్పుడు బంగారం కంటే విలువగా మారిందిగా.. అందుకే మీకు పంపారు’ అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ఈ కామర్స్ సైట్‌పై మండిపడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..