Viral Video: పెళ్లి వేదికపై కొత్త జంట స్టెప్పులకు ఫిదా.. ‘బుల్లెట్‌ బండి కపుల్’ను గుర్తు చేస్తున్న వైరల్‌ వీడియో..

|

Jul 31, 2022 | 4:45 PM

Viral Video: పెళ్లిల్లో జరిగే వేడుకలు అంటేనే సంతోషానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటాయి. ఇక పెళ్లింట జరిగే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. భూమి, ఆకాశం ఏకమయ్యేలా సంతోషాలు వెల్లివిరుస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో పెళ్లి వేదికపై వధూవరులు చేస్తోన్న..

Viral Video: పెళ్లి వేదికపై కొత్త జంట స్టెప్పులకు ఫిదా.. బుల్లెట్‌ బండి కపుల్ను గుర్తు చేస్తున్న వైరల్‌ వీడియో..
Follow us on

Viral Video: పెళ్లిల్లో జరిగే వేడుకలు అంటేనే సంతోషానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటాయి. ఇక పెళ్లింట జరిగే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. భూమి, ఆకాశం ఏకమయ్యేలా సంతోషాలు వెల్లివిరుస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో పెళ్లి వేదికపై వధూవరులు చేస్తోన్న డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్షణాల్లో వైరల్‌ అవుతూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. అప్పట్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ నవ వధువు బుల్లెట్‌ బండి పాటకు చేసిన డ్యాన్స్‌ ఎంతలా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

ఓ నవ జంట వివాహ తంతు పూర్తయిన తర్వాత వేదికపై నిల్చున్నారు. ఇదే సమయంలో బాలవుడ్‌ హిట్‌ మూవీ ఖుద్దర్‌ సినిమాలోని ‘తుమ్సా కోయి ప్యారా’ పాట ప్లే అయ్యేసరికి కొత్త జంట డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. హీరోహీరోయిన్లు తలపించేలా స్టెప్పులతో మెస్మరైజ్‌ చేశారు. పాటకు అనుగుణంగా స్టె్ప్పులు వేస్తూ పెళ్లికి హాజరైన అతిథులను ఆకట్టుకున్నారు. నవ దంపతుల డ్యాన్స్‌ను స్మార్ట్‌ ఫోన్‌లో బంధించిన వారు వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో ఆ కంట ఈ కంట పడి చివరికి దిపాన్షు కబ్రా అనే ఐపీస్‌ ఆఫీసర్‌ చేశారు. దీంతో అతను తన ట్విట్టర్‌ హాండిల్‌లో వీడియో పోస్ట్‌ చేసేసరికి వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. జంట డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు పొగడకుండా ఉండలేకపోతున్నారు. మరి నెట్టింట తెగ సందడి చేస్తోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

వైరల్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..