Viral News: వార్నీ ఇదెక్కడి దోపిడీరా.. టిఫిన్, GSTతో పాటు బిల్లులో ఎక్స్ట్రా గ్యాస్ ఛార్జెస్!

సాధారణంగా మనం ఏదైనా కాస్ట్‌లీ హోటల్‌కు వెళ్తే మనం తిన్న టిఫిన్‌తో పాటు చివర్లో జీఎస్టీ యాడ్ చేయడం కామన్.. కానీ ఇకపై వీటితో పాటు మరో ఛార్జ్‌ను కూడా హోటల్‌ నిర్వాహకులు బిల్లులో యాడ్ చేస్తున్నారు. అవును దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోరతతో ధరలు నేపథ్యంలో ఆ భారాన్ని కస్టమర్లపై వేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. గ్యాస్ సప్లై ఇష్యూ' పేరుతో టిఫిన్ బిల్లులో అదనపు ఛార్జీలు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చెన్నైలో వెలుగు చూసింది.

Viral News: వార్నీ ఇదెక్కడి దోపిడీరా.. టిఫిన్, GSTతో పాటు బిల్లులో ఎక్స్ట్రా గ్యాస్ ఛార్జెస్!
Hotel Gas Charge

Updated on: Mar 13, 2026 | 11:09 AM

టిఫిన్ చేయడానికి హోటల్‌కు వెళ్తే.. బిల్లులో టిఫిన్, జీఎస్టీతో పాటు గ్యాస్ సప్లయ్ ఛార్జీలను కూడా నిర్వాహకులు యాడ్ చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. హోటల్‌లో టిఫిన్ చేసేందుకు వచ్చిన ఓ కస్టమర్ ఇడ్లీ, వడ తిన్నాడు. తర్వాత బిల్లు ఇవ్వాలని అడిగినప్పుడు హోటల్‌ నిర్వాహకుడు అతని బిల్లులో టిఫిన్, జీఎస్టీతో పాటు అదనంగా గ్యాస్ సప్లయ్ బిల్లును కూడా యాడ్ చేసి ఇచ్చాడు. అది చూసిన కస్టమర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం బిల్ పే చేసి దాని ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కోడుతోంది.

చెన్నైలో ఇలా

వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చెన్నైలోని ‘గీరాస్’ రెస్టారెంట్‌కు టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. అతను ఇడ్లీ, వడ తిన్న తర్వాత హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన బిల్ చూసి కంగుతిన్నాడు. ఆ బిల్లులో ఇడ్లీ, వడతో పాటు ‘గ్యాస్ ఛార్జ్’ పేరుతో అదనంగా మరో రూ.10 యాడ్ చేశాడు. ఇక చేసేదేమిలేక కస్టమర్ ఆ మొత్తాన్ని చెల్లించాడు.

బెంగళూరులో అలా

ఒక్క చెన్నైలోనే కాదు దేశవ్యాప్తంగా చాలా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరులో సైతం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నగరంలోని ఓ హోటల్ భోజనం చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్‌కు గ్యాస్ ఛార్జీ పేరుతో ఏకంగా రూ.30 వరకు అదనంగా వసూలు చేశారట. గ్యాస్ కొరత నేపథ్యంలో హాస్టల్‌లో ఫుడ్‌ పెట్టట్లేదని హోటల్‌కు వెళ్తే.. అక్కడి నిర్వాహకులు నిండా దోచుకుంటున్నారని సదురు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన బిల్‌ను సిటీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ సదురు కస్టమర్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.

అయితే సోషల్‌ మీడియాల్‌లో ఈ గ్యాస్ బిల్లులకు సంబంధించిన పోస్ట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు హోటల్ నిర్వాహకుల తీరుపై మండి పడుతున్నారు. గ్యాస్ కొరత ఉంటే స్టాక్ ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి కానీ.. ఆ భారాన్ని కస్టమర్లపై నెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us