Viral Video: ఇదేందిరయ్యా.. పెళ్లి కాగానే రోడ్డుపై ఇలా పరుగు మొదలెట్టారు.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

పెళ్లి.. అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరగాలని కోరుకుంటారు. కుటుంబసభ్యులు.. బంధుమిత్రుల మధ్యలో ఎంతో సరదాగా సంతోషంగా తమ వివాహం

Viral Video: ఇదేందిరయ్యా.. పెళ్లి కాగానే రోడ్డుపై ఇలా పరుగు మొదలెట్టారు.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..
Viral

Updated on: May 03, 2022 | 9:45 PM

పెళ్లి.. అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరగాలని కోరుకుంటారు. కుటుంబసభ్యులు.. బంధుమిత్రుల మధ్యలో ఎంతో సరదాగా సంతోషంగా తమ వివాహం కావాలనుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వేల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్.. వెడ్డింగ్ రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పక్కర్లేదు.. ఎక్కడ చూసిన పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని అందంగా ఉండగా.. మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తాయి.. అలాగే.. మరికొన్ని వీడియోస్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం షాకవుతారు. పెళ్లి అయిన క్షణాల్లోనే ఓ నూతన వధూవరులు రోడ్డుపై పరుగులు పెట్టారు . వారి వెనకే వారి బంధువులు.. కుటుంబసభ్యులు సైతం పరుగులు పెట్టారు.. ఇంతకీ వారు ఎందుకు అలా పరిగెత్తారో తెలుసుకుందామా.

ఆ వీడియో పెళ్లి బట్టల్లో ఉన్న వధూవరులు ఇద్దరు ఓ చిన్నపాటి రోడ్డుపై పరుగు మొదలు పెట్టారు. వారి ముందు ఓ కారు వేగంగా వెళ్తుంది.. అలాగే వారి వెనక కొందరు బంధువులు సైతం పరుగులు పెట్టారు.. ఓ వైపు భానుడి ప్రతాపం.. మరోవైపు మట్టిరోడ్డుపై దుమ్ము.. ఇవన్ని లెక్కచేయకుండా వారు పరుగెడుతున్నారు. అయితే వీరు ఎందుకు కారు వెనకాల పరిగెత్తారనేది మాత్రం తెలియరాలేదు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..

God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..

Rama Rao On Duty Movie: మాస్ మాహారాజా సినిమా నుంచి ఫెస్టివల్ అప్డేట్.. మరో సాంగ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

Loading...
Unable to load recommendations.
Follow Us