చాలా మంది చిన్నారులు చదువుకునే వయసులో స్కూల్ కు వెళ్లకుండా కుటుంబపోషణ కోసం బాల కార్మికులుగా మారతారు. అలాంటి వారిని చూసినప్పుడల్లా అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కొందరు మాత్రం పేదరికంతో జీవిస్తున్నప్పటికీ వారు సంతోషంగా కాలం గడుపుతుంటారు. తాజాగా పొట్టకూటి కోసం ఐస్ క్రీం అమ్ముతున్న చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఐస్ క్రీం అమ్ముతున్న బాలుడి వద్దకు ఓ వ్యక్తి వెళ్తాడు. అతను ప్రేమతో ఆ చిన్నారికి రూ.100 నోటు ఇచ్చి, ఈ డబ్బును ఏం చేస్తావని అడిగుతాడు. దీనికి ఆ చిన్నారి చెప్పిన సమాధానం అందరి మనసు దోచేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్న పిల్లవాడు గుంతలో ఇరుక్కున్న తన ఐస్‌క్రీమ్ బండిని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, హ్యాండ్‌కార్ట్ తీయడంలో పిల్లవాడికి సహాయం చేస్తాడు.
బండి బయటకు తీసిన తర్వాత ఆ వ్యక్తి ఒక ఐస్ క్రీం ధర ఎంత అని అడుగుతాడు. ఆ చిన్నారి మాత్రం తనకు సహాయం చేశాడన్న విషయాన్ని గుర్తుంచుకుని అతనికి ఫ్రీగా ఐస్ క్రీం ఇస్తానని చెబుతాడు. అంతే కాదు ఇస్తాడు కూడా. దీనికి ఆ వ్యక్తి కూడా సంతోషించి వంద రూపాయల నోటు ఇస్తాడు. ఆ డబ్బును ఏం చేస్తావని అడిగితే.. ఈ డబ్బును తన తల్లికి ఇస్తానని ఆ చిన్నారి చెప్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని, చిన్నారిని తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.