Viral Video: ‘ఫస్ట్ నైట్ కూడా వదల్లేదుగా’.. ముద్దులాటకు లైట్స్, కెమెరా, యాక్షన్.. ఇదేం బూతు పురాణం

ఇంటర్నెట్‌లో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని భయపెడతాయి. ఇక ఇంకొన్ని చూస్తే ఇవేంటి.. వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారని అనిపిస్తుంది. అదే తరహ వీడియో ఒకటి చూద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral Video: ఫస్ట్ నైట్ కూడా వదల్లేదుగా.. ముద్దులాటకు లైట్స్, కెమెరా, యాక్షన్.. ఇదేం బూతు పురాణం
Telugu News Trending

Updated on: Sep 15, 2025 | 1:36 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ లైక్స్, వ్యూస్ కోసమే ఎక్కువగా తాపత్రయపడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే వరకు నాలుగు గోడల మధ్య జరిగే విషయాలను కూడా నలుగురితో పంచుకుంటూ.. విమర్శల పాలవుతున్నారు. మొన్నటికి మొన్న ఫస్ట్ నైట్ వీడియో అంటూ కొత్తగా పెళ్ళైన జంట వీడియో తీయగా.. ఇప్పుడు అదే రీతిలో మరో జంట.. ఇదిగో మా ఫస్ట్ నైట్ వ్లోగ్ అంటూ నెట్టింట దుకాణం పెట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. దీన్ని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో మండిపడుతున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. కొత్తగా పెళ్ళైన జంట.. తమ ఇంటిమేట్ మూమెంట్‌ను అస్వాదిస్తుంటే.. దాన్ని ఎంచక్కా తమ కెమెరాలలో బంధిస్తూ కనిపించారు ఫోటోగ్రాఫర్లు. నాలుగు గోడల మధ్య జరిగే ఇలాంటి క్షణాలను కూడా వైరల్ అవ్వడానికి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కాగా.. ఓ ట్విట్టర్ నెటిజన్ దీన్ని పోస్ట్ చేసి.. ‘లైకులు, వ్యూస్ కోసం జనాలు ఎందుకింత పిచ్చోళ్లు అయిపోతున్నారో.? వారి సొంత జీవితం, వారి మధురక్షణాలు.. నైతికత, సంస్కృతిని పక్కనపెట్టి.. లైకుల కోసం ఈ మధ్యకాలంలో యువత తమ ఫస్ట్ నైట్‌పై కూడా వ్లోగ్స్ చేసేస్తున్నారు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వారిద్దరిని తెగ తిట్టిపోస్తున్నారు. ఒకప్పుడు ప్రైవేట్‌గా ఉండే ఇలాంటి విషయాలు.. ఇప్పుడు ప్రజా వినోదంగా మారాయి. మన దేశానికి.. పాశ్చాత్య దేశాలకు మధ్య సాంస్కృతిక తేడాలు ఉన్నాయని మర్చిపోతున్నారు. అని ఒకరు కామెంట్ చేయగా.. లైకుల కోసం పిచ్చోళ్లు అయిపోతున్నారు ఈ కాలం యువత అని మరొకరు మండిపడ్డారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.