Bihar: త్వరలో నా ఆరోగ్యం పాడవుతుంది.. ఆరోజు నాకు కడుపునొప్పి రావచ్చు.. లీవ్‌ ల కోసం ఫన్నీ రీజన్స్..

|

Dec 03, 2022 | 9:50 AM

ఆఫీసుల్లో లీవులు కావాలంటే ఓ పట్టానా దొరకవు. సెలవుల కోసం నెల రోజుల ముందు నుంచే రిక్వెస్టులు చేసుకోవాలి. మనం చెప్పే రీసన్ సరైనదే అని అనిపిస్తే.. దయ ఉంచి లీవ్ ఇస్తారు. లేకుంటే మాత్రం ఇక అంతే..

Bihar: త్వరలో నా ఆరోగ్యం పాడవుతుంది.. ఆరోజు నాకు కడుపునొప్పి రావచ్చు.. లీవ్‌ ల కోసం ఫన్నీ రీజన్స్..
Leave
Follow us on

ఆఫీసుల్లో లీవులు కావాలంటే ఓ పట్టానా దొరకవు. సెలవుల కోసం నెల రోజుల ముందు నుంచే రిక్వెస్టులు చేసుకోవాలి. మనం చెప్పే రీసన్ సరైనదే అని అనిపిస్తే.. దయ ఉంచి లీవ్ ఇస్తారు. లేకుంటే మాత్రం ఇక అంతే.. అయితే ఒక్కోసారి అధికారులు తమ ఉద్యోగుల విషయంలో విధించే రూల్స్‌ ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా బిహార్ లో అలాంటి ఘటనే జరిగింది. లీవ్‌ కావలసిన వాళ్లు ముందుగానే అప్లై చేసుకోవాలని యాజమాన్యం చెప్పడంతో ఉద్యోగులు తమదైన శైలిలో సెలవు కోసం అప్లై చేసుకున్నారు. ఆ లీవ్‌ లెటర్స్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు రాసిన లీవ్‌ లెటర్‌లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్‌ కుమార్‌ అనే ఉపాధ్యాయుడు.. చెప్పిన రీసన్ విని అధికారులు షాక్ అయ్యారు. ఇలాంటి రీసన్స్ ఎలా వస్తాయని నెటిజన్లు మండిపడుతుండగా.. లీవుల కోసం అడ్డమైన రూల్స్ అన్నీ పెట్టే వారికి ఇది చెంపదెబ్బ లాంటిదని అంటున్నారు. ఇంతకీ అతనేం చెప్పాడో తెలుసా..

‘మా అమ్మ ఈ నెల 5వ తేదీ రాత్రి 8 గంటలకు చనిపోతారు. అంత్యక్రియల కోసం.. 6, 7 తేదీల్లో సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి’ అని తన ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. బరాహత్‌లోని ఖాదియారాకు చెందిన ఉర్దూ పాఠశాలలోని రాజ్‌ గౌరవ్‌ అనే మరో ఉపాధ్యాయుడు ‘త్వరలో తన ఆరోగ్యం పాడవుతుందని, కనుక డిసెంబర్‌ 4,5 తేదీల్లో తనకు సెలవు కావాలి’ అంటూ లీవ్‌ లెటర్‌ ఇచ్చాడు. ఇక బీహార్‌లోని కటోరియా ప్రాంతానికి చెందిన నీరజ్‌ కుమార్‌ అనే టీచర్‌ క్యాజువల్‌ లీవ్‌ అప్లై చేసాడు. అందుకు అతను చూపిన కారణం ఏంటంటే..

తను డిసెంబర్‌ 7న పెళ్లికి వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో అక్కడ తాను కాస్త ఎక్కువగా భోజనం చేస్తానని, దాంతో తనకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది కనుక తనకు సెలవు ఇవ్వాలంటూ లీవ్‌ లెటర్‌లో పేర్కొన్నాడు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. ఈ టీచర్స్‌ ఇలా బిహేవ్‌ చేయడానికి కారణం లేకపోలేదు. సెలవులు కావాల్సినవాళ్లు ముందే దరఖాస్తు చేసుకోవాలంటూ భాగల్‌పుర్‌ కమిషనర్‌ దయానిధన్‌ పాండే ఉత్తర్వులు జారీ చేశారట.. అదీ సంగతి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..