Shocking News: జనాలకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి కారణంగానే వింత వింత పనులు చేస్తుంటారు. ఆఖరికి ఇబ్బందులపాలవుతుంటారు. ఇక శారీరక, మానసిక ఆనందం కోసం విచిత్రమైన పనులు చేసే వ్యక్తులు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. తాజాగా నేపాల్‌లో ఓ విచిత్రమైన కేసు వెలుగు చూసింది. ఓ వ్యక్తి చేసిన పనికి.. ఏకంగా తన ప్రైవేట్ పార్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అవునండీ బాబూ.. లైంగికానందం కోసం పిచ్చి పనులు చేసి అసలుకే మోసపోయాడు.
వివరాల్లోకెళితే.. నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి బాటిల్ ద్వారా లైంగికానందం పొందడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ వ్యక్తి ప్రైవేటు పార్ట్ ఆ బాటిల్‌లో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా.. దాదాపు రెండు నెలల పాటు అలాగే దాచి ఉంచాడు. బాటిల్‌లో ఇరుక్కుపోయిన ఆ ప్రైవేట్ పార్ట్‌కు రక్తప్రసరణ లేకపోవడం అదికాస్తా పుండులా మారిపోయింది. చివరకు రెండు నెలల తరువాత తట్టుకులేని నొప్పి వస్తుండటంతో.. ఆస్పత్రికి పరుగెత్తాడు. వైద్యులకు చూపించాడు. అది చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఏదేమైనా అతన్ని ఆస్పత్రిలో చేర్చుకుని శస్త్ర చికిత్స ద్వారా బాటిల్‌లో ఇరుక్కుపోయిన ప్రైవేట్ పార్ట్‌ను బయటకు తీశారు. అయితే, రక్తప్రసరణ లేకపోవడంతో కొంత భాగం పుండులా మారిపోయింది. దాంతో ఆ భాగాన్ని తొలగించేశారు వైద్యులు. ప్రస్తుతం అతని ప్రైవేట్ పార్ట్ లేకపోయినా.. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రజలు ఎవరూ ఇలా పిచ్చి పనులు చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే అసలుకే మోసం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
Also read:
Viral Photos: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చెట్టు ఇదే..! తాకితే చాలు ప్రాణాలు పోతాయ్..
Yes Bank: గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన యెస్ బ్యాంక్.. ఎంత తగ్గించిందంటే..?