Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో అందమైన వధువులకు సంబంధించిన వీడియోలు
తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. అందుకే
వివాహానికి సంబంధించిన ఏ వీడియో అయినా వెంటనే వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు కూడా ఒక
కొంటె పెళ్లికూతురు వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా చెబుతారు చాలా
క్యూట్ వీడియో అని. ఈ వీడియోలో పెళ్లి తర్వాత భోజనం చేస్తున్నప్పుడు వధువు ఒక కొంటెపని
చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ అల్లరి అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. పెళ్లిళ్లలో
ఫోటోగ్రాఫర్‌లు తమ అందమైన క్షణాలను క్యాప్చర్ చేయడానికి వివిధ రకాల పోజులు ఇవ్వాలని
జంటలని అడుగుతారు. ఇప్పుడు ఈ విషయం ఎంత ముదిరిపోయిందంటే ఫోటోగ్రాఫర్లు కూడా
ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ వీడియోను చూడండి. ఇందులో పెళ్లి తర్వాత వధూవరులు భోజనం
చేస్తున్నారు. ఈ సమయంలో వధువు తన చేతులతో వరుడికి అన్నం తినిపించాలని అనుకుంటుంది.
ఇది చూసి పెళ్లికొడుకు సంతోషంతో పొంగిపోతాడు. అన్నం కలిపి నెమ్మదిగా అతనికి
తినిపించడానికి చేయి నోటిదాకా తీసుకెళుతుంది కానీ సడెన్‌గా ఆ ముద్దని తనే తినేస్తుంది. ఇది
చూసిన చుట్టుపక్కల వారు పగలబడి నవ్వుతుంటారు. పెళ్లికూతురు చేసిన పనికి పెళ్లికొడుకు
నోరెళ్లబెడుతాడు. అందరు అతడి ఎక్స్‌ప్రెషన్స్ చూసి బిగ్గరగా నవ్వడం ప్రారంభిస్తారు.
పెళ్లిలో ఇలాంటి సరదా సంఘటనలు జీవితాంతం గుర్తుండే విధంగా చేస్తారయి. ఈ వీడియో
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు చిలిపి పెళ్లికూతరు అంటూ అమ్మాయిని
అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 6 లక్షల 80 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ
సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో చాలా మంది దీనిపై కామెంట్ చేస్తున్నారు.
మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీ స్పందనని తెలియజేయండి.