Viral: క్వీన్ ఎలిజబెత్-II మరణ తేదీని ముందే చెప్పేసిన ట్విట్టర్ యూజర్.. అతను టైమ్ ట్రావెలరా..?

|

Sep 09, 2022 | 6:10 PM

బ్రిటన్‌ని సుదీర్ఘకాలం ఏలిన మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 1926, ఏప్రిల్‌ 21న కింగ్‌ జార్జ్‌-6, క్వీన్‌ ఎలిజబెత్‌ అంగేలా మార్గరెట్‌లకు...లండన్‌లోని 17 బ్రూటన్‌ స్ట్రీట్‌లో జన్మించారు. ఎలిజబెత్‌ II పూర్తిపేరు ఎలిజబెత్‌ అలెగ్జాండ్రా మేరీ.

Viral:  క్వీన్ ఎలిజబెత్-II మరణ తేదీని ముందే చెప్పేసిన ట్విట్టర్ యూజర్.. అతను టైమ్ ట్రావెలరా..?
Queen Elizabeth Ii Death
Follow us on

Trending: రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఏడు దశాబ్దాలకు పైగా పాటు ఏకబిగిన పరిపాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌ II మరణం(Queen’s Elizabeth II’s death)తో ఒక శకం ముగిసింది. దశాబ్దాల రాచరిక పాలనలో ఎన్నో మలుపులూ, మరెన్నో అనుభవాలను మూటగట్టుకున్న వృద్ధమాత క్వీన్‌ ఎలిజబెత్‌ II…బ్రిటన్‌లోని బాల్‌మోరల్‌ కాసిల్‌లో గురువారం ప్రశాంతంగా కన్నుమూశారు. దీంతో బ్రిటన్‌ చరిత్రలో అంకం ముగిసింది. బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఏడు దశాబ్దాలకు పైబడి మహారాణిగా ఉన్న ఆమెకు ఆమే సాటి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వైభవానికి ఆమె నిలువెత్తు నిదర్శనం. దశాబ్దాల బ్రిటిష్‌ రాచరిక పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ. రవి అస్తమించిన బ్రిటిష్‌ సామ్రాజ్య ఉద్దాన పతనాలకు నిశ్శబ్ద సాక్షి. ఆ మహా సామ్రాజ్ఞి… క్వీన్‌ ఎలిజబెత్‌ మరణం యిప్పుడు ఒక్క బ్రిటన్‌లోనే కాదు. యావత్‌ ప్రపంచంలో హాట్‌ టాపిక్‌. జలియన్‌ వాలా బాగ్‌ ఊచకోతకి బహిరంగ క్షమాపణలు చెప్పి మహామహులే చేయలేని పనిచేసిన రాణి ఎలిజబెత్‌ భారతీయుల మదిని దోచుకుంది. ప్రపంచ ప్రజల మన్ననలూ అందుకుంది. ఎలిజబెత్‌ మరణంపై ప్రపంచ దేశాల నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఎలిజబెత్‌ 2 నాయకత్వంలో బ్రిటిష్‌ జాతికి స్ఫూర్తినందించారన్నారు భారత ప్రధాని మోదీ. రాణి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎలిజబెత్‌ దృఢమైన నేతగా గుర్తిండిపోతారని వ్యాఖ్యానించారు మోదీ.

అయితే ఓ ట్విట్టర్ యూజర్.. ఆమె మరణించే తేదీని ముందే ఊహించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. క్వచ్చన్ మార్క్ సింబల్‌(?) తో ఉన్న ఆ యూజర్.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న మహారాణి సెప్టెంబర్ 8న చనిపోతారని ట్వీట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు అతడు ఎలా ఊహించగలిగాదో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అతడు టైమ్ ట్రావెలర్ అయి ఉంటాడని కొందరు.. కాలజ్ఞానం తెలుసేమో అని మరికొందరు ఊహాజనిత కామెంట్స్ పెడుతున్నారు.

అతడి ట్విట్టర్ అకౌంట్ చాలా మిస్టిరియస్‌గా ఉంది. మార్చి 17, 2062న భూమి మొత్తం మంటల్లో కాలిపోతుందని కూడా ఓ ట్వీట్ పెట్టాడు. మొత్తం మీద ఈ ట్విట్టర్ యూజర్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమయ్యాడు. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..