Telugu News Trending Young woman dance front of dog video was gone viral in Social Media Telugu viral News
Video Viral: కాలా చష్మా పాటకు యువతి అద్భుతమైన డ్యాన్స్.. ఎవరిముందు చేసిందో తెలిస్తే ఫ్యూజులౌట్
సోషల్ మీడియా (Social Media) కుర్రకారును ఊపేస్తోంది. డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, ఫన్నీ అలా తమలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు చక్కటి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లో చాలా రకాల...
సోషల్ మీడియా (Social Media) కుర్రకారును ఊపేస్తోంది. డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, ఫన్నీ అలా తమలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు చక్కటి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లో చాలా రకాల వీడియోలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం అనిపిస్తే మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Viral) గా మారింది. ప్రస్తుతం కాలా చష్మా పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఎవరిని చూసినా ఈ డ్యాన్స్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నా్యి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ లో ఓ యువతి కుక్క ముందు ‘కాలా చష్మా’ పాటకు డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. పొలం గట్టుపై కొందరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. అంచున ఉన్న చెట్టు దగ్గర కొంతమంది అమ్మాయిలు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు ఎర్ర రంగు చీర కట్టుకని ఆకర్షణీయంగా ఉన్నారు. ఆమె వద్దకు ఓ కుక్క వచ్చింది. అయినా ఆమె ఏ మాత్రం భయపడకుండా శునకంతో ఫన్నీ డ్యాన్స్ చేసింది. కుక్క ముందు కాలా చష్మా పాటకు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ కుక్క కూడా ఆమె చేస్తు్న్న డ్యాన్స్ ను చూసి థ్రిల్ అవుతున్నట్లుగా తోకను ఊపుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటివరకు వందల కొద్దీ లైక్‌లు వచ్చాయి. కుక్కల ముందు డ్యాన్స్ చేయడం అద్భుతంగా ఉందని, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా స్నేహితులకు, బంధువులకు వీడియో షేర్ చేస్తున్నారు.