Tiger Rare Video: వావ్‌.. చాలా అరుదైన వీడియో.. క్యూట్ పిల్లలతో రోడ్డు దాటుతున్న తల్లి పులి..

|

Mar 31, 2025 | 7:15 AM

సఫారీకి వెళ్ళే వారు పులులను చూడటం చాలా అరుదు. కానీ, ఇక్కడ ఏకంగా ఒకేసారి ఐదు పులులు కనిపించాయి. దాంతో ఆ పర్యాటకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒకేసారి ఐదు పులులను చూసిన పర్యాటకులు వెంటనే తమ సెల్‌ఫోన్లతో వీడియోలు,ఫోటోలు తీశారు. X ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో

Tiger Rare Video: వావ్‌.. చాలా అరుదైన వీడియో.. క్యూట్ పిల్లలతో రోడ్డు దాటుతున్న తల్లి పులి..
Mysore Tigress
Follow us on

మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఉంటారు. వారు ఎప్పుడూ సమయం దొరికినా జంగిల్ సఫారీకి వెళ్లడం ఇష్టపడతారు. అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో జంగిల్‌ సఫారీకి వెళ్తుంటారు. అలా అడవిలో సఫారికి వెళ్లిన కొందరు పర్యాటకులకు అద్భుత దృశ్యం కనిపించింది. సఫారీకి వెళ్ళే వారు పులులను చూడటం చాలా అరుదు. కానీ, ఇక్కడ ఏకంగా ఒకేసారి ఐదు పులులు కనిపించాయి. ఇక అప్పుడా పర్యాటకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మైసూరులోని దమ్మనకట్టేలో ఇలాంటి అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సఫారీకి వెళ్లిన పర్యాటకులను సందర్శించడానికి ఒక తల్లి పులి తన నాలుగు అందమైన పిల్లలతో బయటికి వచ్చింది. ఎంతో గాంభీరమైన పులి తన పిల్లలతో రోడ్డు దాటడం చూసిన పర్యాటకులు ఆనందంలో మునిగిపోయారు. ఒక తల్లి పులి తన నాలుగు పిల్లలతో కలిసి రోడ్డు దాటుతున్నే దృశ్యం అందరిని కట్టిపడేసింది. భయంకరమైన వేటతో ఎప్పుడూ గంభీరంగా కనిపించే పెద్ద పులి.. తల్లిగా తన పిలల్ని చూసుకుంటున్న తీరుకు పర్యాటకులు ఆశ్చర్యంతో చూశారు. రోడ్డుకు ఒక వైపు నుండి మరొక వైపుకు నడిచి వెళ్ళే పులి, దాని అల్లరి పిల్లలను చూసి పర్యాటకులు ఎంతగానో ఆనందించారు. అంతేకాకుండా, ఈ అరుదైన దృశ్యాన్ని చాలా మంది తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలోని సంఘటన మార్చి 28శుక్రవారం రోజున జరిగింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను శిల్ప (శిల్పాప్డ్క్మైసురు) అనే ఎక్స్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో పులి తన అందమైన ఓ పిల్లను నోట్లో పెట్టుకుని రోడ్డు దాటిస్తున్న సీన్‌ అందరిని కట్టిపడేలా కనిపించింది. ఒకేసారి ఐదు పులులను చూసిన పర్యాటకులు వెంటనే తమ సెల్‌ఫోన్లతో వీడియోలు,ఫోటోలు తీశారు. X ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. తల్లి పులి ఒక పిల్లను నోటిలో పెట్టుకుని రోడ్డు దాటుతుండగా, మిగిలిన పిల్లలు ఆ తల్లి వెనకాలే చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీక్షకులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..