Viral: ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులౌట్

|

Jul 02, 2024 | 10:43 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కి తన భర్తతో కలిసి వెళ్లిన ఓ భార్య.. అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తాను ఇకపై తన భర్తతో కలిసి ఉండలేనని.. ప్రియుడితోనే ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే..

Viral: ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులౌట్
Viral
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కి తన భర్తతో కలిసి వెళ్లిన ఓ భార్య.. అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తాను ఇకపై తన భర్తతో కలిసి ఉండలేనని.. ప్రియుడితోనే ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే.. సదరు మహిళ, ఆమె ప్రియుడి ఖర్చులు తన భర్తే భరించాలని చెప్పింది. వినడానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ.. నిజంగా ఇదే జరిగింది..

వివరాల్లో వెళ్తే.. ఆగ్రాకు చెందిన ఓ మహిళ తన భర్త ముందు వింత డిమాండ్ పెట్టింది. ఇక తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేదని, తన ఇద్దరు కూతుళ్లను తీసుకెళ్లి ప్రియుడితో ఉంటానని చెప్పింది. అయితే తమ ఖర్చులన్నీ భర్తే భరించాలని డిమాండ్ చేసింది. ‘నా ప్రియుడికి కూడా భార్య, పిల్లలు ఉన్నారు. అతడి ఖర్చులు వారికే సరిపోతాయి. కాబట్టి, నా ఖర్చులు నిర్వహించలేడు. అందుకే మా నెలవారీ ఖర్చులు నా భర్తే భరించాలని’ ఆ మహిళ డిమాండ్ చేసింది. అయితే ఈ వింతైన డిమాండ్‌కు ఆమె భర్త అంగీకరించలేదు. తన భార్య.. ఆమె ప్రియుడితో కలిసి జీవించాలనుకున్నప్పుడు.. తానెందుకని ఆ ఖర్చులు భరించాలంటూ ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఈ విషయంపై భార్యాభర్తలిద్దరూ స్థానిక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా సదరు మహిళ వింత కోరిక విన్న సిబ్బంది.. దెబ్బకు షాక్ అయ్యారు.

కాగా, వీరికి కౌన్సిలింగ్ ఇస్తోన్న సైకాలజిస్ట్ అమిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి ఇరువురికి పెళ్లై 10 ఏళ్లు అయిందని.. ఈ సమయంలో ఆమె తన ప్రియుడితో కలిసి జీవించాలనుకుంటోందని చెప్పారు. అయితే భర్త నుంచి నెలవారీ ఖర్చులు అడుగుతోందని పేర్కొన్నారు. కానీ అందుకు భర్త అంగీకరించలేదని.. వీరిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం కూడా కుదరలేదని.. మరోసారి ఈ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి.. సదరు మహిళ ఆలోచనలు మార్చేందుకు ప్రయత్నిస్తామన్నారు అమిత్.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి