సర్.. అలాగే ఉండండి.. మీకు నేను పేలు చూస్తా

పోలీస్ స్టేషన్‌లోకి వచ్చే నిందితుల తాట తీసే పోలీసులను ఆటాడేసుకుంది ఓ కోతి. ఏకంగా పోలీస్ ఠాణాలోకే వెళ్లి.. అక్కడ అది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన చేష్టలతో ఓ పోలీస్‌ ఆఫీసర్ భుజాలెక్కి.. అతడి తలలో పేలు చూసి ఫ్రీ హెడ్ మసాజ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని పిలిబిత్ జిల్లాలోని ఓ పోలీస్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:45 pm, Thu, 10 October 19
సర్.. అలాగే ఉండండి.. మీకు నేను పేలు చూస్తా

పోలీస్ స్టేషన్‌లోకి వచ్చే నిందితుల తాట తీసే పోలీసులను ఆటాడేసుకుంది ఓ కోతి. ఏకంగా పోలీస్ ఠాణాలోకే వెళ్లి.. అక్కడ అది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన చేష్టలతో ఓ పోలీస్‌ ఆఫీసర్ భుజాలెక్కి.. అతడి తలలో పేలు చూసి ఫ్రీ హెడ్ మసాజ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని పిలిబిత్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లోకి ఓ మధ్యాహ్నం కోతి వెళ్లింది. దానిని తరిమేందుకు అక్కడి మహిళా పోలీసులు ప్రయత్నించినా.. వారిలో ఒకరిని కొరికేసింది. ఆ తరువాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీకాంత్ ద్వివేది టేబుల్ దగ్గరికి వెళ్లింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతడిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఏమీ చేయలేక శ్రీకాంత్ తన సీటులో కూర్చుండిపోయారు. ఇదే సమయమనుకొని అతని దగ్గరకు వెళ్లి భుజాలపైకెక్కి.. తలలోని పేలును చూస్తూ కూర్చొంది. ఇక ఏమీ చేయాలో పాలుపోని ఆ పోలీస్ అధికారి.. తాను కూడా కోతిని పట్టించుకోకుండా.. తన పనిలో నిమగ్నమయ్యారు. ఏ మాత్రం తాను కదిలి లేచేందుకు ప్రయత్నించినా.. అది దాడి చేస్తుందన్న భయమో..? మరేమో..? గానీ చాలా సేపు కుర్చీలోంచి కదల్లేదు. ఇక మధ్య రాత్రి వరకు ఆ కోతి పోలీస్ స్టేషన్‌లోనే తిరిగిందని.. ఉదయం అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ కోతిని తీసుకెళ్లి స్థానిక అడవిలో వదిలారని శ్రీకాంత్ తెలిపారు.

ఈ వీడియోను అడిషనల్ ఎస్పీ రాహుల్ శ్రీవాత్సవ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి.. ‘‘పనిలో నిమగ్నమైనప్పుడు ఎవ్వరినీ పట్టించుకోకూడదు అన్నది ఈ ఇన్‌స్పెక్టర్ పనితీరును చూస్తే అర్థమవుతోంది. తలలో పేలును తొలగించుకునేందుకు అతడు కచ్చితంగా రీటా, శీకాకాయ్ లేదా మంచి షాంపూ వాడాలి’’ అని సరదాగా కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియో ఆ తరువాత వేలకొద్దీ షేర్లు, లైక్‌లతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో ఆ పోలీస్ సహనాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరేమో పేలును పోగొట్టుకోవడం కోసం కోతి మసాజ్ బెటరేనని సెటైర్లు వేస్తున్నారు.