Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు..

కోతి చేసే అల్లరి చేష్టల గురించి తెలిసిందే. సాధారణంగా కోతులు ఏం చేసిన నవ్వులు తెప్పిస్తాయి. కోతులు ఏ జంతువుకు భయపడవు.

Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు..
Viral

Updated on: Feb 14, 2022 | 8:42 AM

కోతి చేసే అల్లరి చేష్టల గురించి తెలిసిందే. సాధారణంగా కోతులు ఏం చేసిన నవ్వులు తెప్పిస్తాయి. కోతులు ఏ జంతువుకు భయపడవు. ఎంతటి ప్రమాదకరమైన జంతువుకు.. భారీ ఖాయమున్న జంతువుకు ఏమాత్రం భయపడవు. మనుషులతోపాటు.. ఇతర జంతువులను సైతం వాటి అల్లరి చేష్టలతో చిరాకు పుట్టిస్తాయి. తమపై అటాక్ చేయడానికి ప్రయత్నించిన వాటిని తిరిగి ముప్పు తిప్పలు పెట్టే వరకు వదిలిపెట్టవు. అయితే కొన్ని సందర్భాల్లో కోతులు చేసే అల్లరి చేష్టలు విసుగు పుట్టిస్తాయి. ఇక ఇటీవల ఇళ్లలోకి చేరి అవి ఆగడాల గురించి తెలసిందే. ఇళ్లలోకి చేరి అవి చేసే విద్వంసంతో ప్రజలు ఇబ్బందులు పెడుతుంటాయి.

తాజాగా ఓ కోతి తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన చిరుతపులికి చుక్కలు చూపించింది. చెట్టుపై అటు ఇటు దూకుతూ ముప్పు తిప్పలు పెట్టి అలసి పోయేలా చేసింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఓ కోతి చెట్టుపై కూర్చుని ఆహారం తింటుండగా.. అటు వైపు వచ్చిన చిరుతపులి ఆ కోతిని గమనించింది. వెంటనే చెట్టు పైకి ఎక్కి ఆ కోతిని ఎలాగైనా పట్టుకోవాలనుకుంది. కానీ ఆ కోతి తన తెలివితో ఆ చిరుతపులిని చుక్కలు చూపించింది. చెట్టు చివరన చిటారు కొమ్మలపై అటు ఇటు దూకుతూ చిరుతపులికి చిక్కకుండా ఆడింది. కోతితోపాటు.. చిరుతపులి కూడా చెట్టు కొమ్మలపై అటు ఇటు దూకుతూ వచ్చింది. అయితే దూకి దూకి చిరుతపులి అలసిపోయింది కానీ.. ఆ కోతి మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. చివరకు విసుగు పుట్టిన చిరుతపులి.. ఆకలిని చంపుకుని ఆ కోతిని విడిచిపెట్టి కిందకు దిగింది. మొత్తానికి తన అల్లరితో చిరుతపులి నుంచి భయటపడి తన ప్రాణాలను కాపాడుకుంది ఆ కోతి. ఇది పాత వీడియోనే అయినా.. ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ కోతి తెలివికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరు చేసేయ్యండి.

Also Read: Krithi Shetty: ఉప్పెన సినిమా విడుదలై ఏడాది పూర్తి .. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన బేబమ్మ..

Gurtunda Seethakalam: వాలెంటైన్స్ డే రోజున మరో స్పెషల్ అప్డేట్.. అందమైన ప్రేమకథ గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రేపే

Malli Modalaindi: కమర్షియల్ అంశాన్ని ఎంటర్‏టైన్‏గా చెప్పడమే ఇష్టం.. అందుకే ఇలా.. డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..