
Viral Video: భూ ప్రపంచంలో తల్లిని మించినది మరొకటి లేదు అంటారు. తల్లి ప్రేమ అనంతం. తన బిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా.. తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా కాపాడుకుంటుంది. అది మానవులు అయినా.. జంతువులు, పక్షులు అయినా తల్లి ప్రేమలో ఏమాత్రం తేడా ఉండదు. తాజాగా తల్లి ప్రేమకు సాక్షి రూపమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెలు పిండేసేలా ఉన్న ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తల్లి ప్రేమ ముందు మరేదైనా దిగదుడుపే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందో చూద్దాం..
కష్టాల్లో ఉన్న తన పిల్లలను చూసిన ఏ తల్లి అయినా.. తమ పిల్లలను రక్షించాలనే ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా లెక్కచేయదు. ఈ వీడియోలోనూ అదే దృశ్యం సాక్షాత్కారం అయ్యింది. మట్టి కుప్పపై ఓ పక్షి గూడు కట్టుకోవడమే కాకుండా.. గుడ్లు కూడా పెట్టింది. ఓ జేసీబీ భూమిని చదును చేస్తోంది. ఇంతలో పక్షి గుడ్లు ఉన్న ప్రాంతానికి రానే వచ్చింది జేసీబీ. వెంటనే అలర్ట్ అయిన పక్షి.. జేసీబీని అడ్డుకునే ప్రయత్నం చేసింది. తన చిన్న ప్రాణాన్ని జేసీబీకి అడ్డు వేసి.. తన గుడ్లను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. జేసీబీ ముందుకు కదలడం ఆలస్యం.. తన రెక్కలను విప్పార్చి గుడ్లను కవర్ చేసింది. తల్లి పక్షి రియాక్షన్‌ను గుర్తించిన జేసీబీ డ్రైవర్.. పలుమార్లు దానిని భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్లో షేర్ చేశారు.
Also read:
Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!
US President Biden: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. గన్ కల్చర్‌పై ప్రత్యేక ఫోకస్..
Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..