Telugu News Trending Mobile Theft in metro station video was gone viral in social media Telugu news
Video viral: ఇదెక్కడి దొంగతనం మావా.. మెట్రో స్టేషన్ లో జరిగిన చోరీని చూస్తే పడీపడీ నవ్వాల్సిందే..
దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు చోరీ చేసి పారిపోతున్నారు. రెప్పపాటు కాలంలో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇక కొందరి తీరు చూస్తే చోరీలు చేయడంలో..
దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు చోరీ చేసి పారిపోతున్నారు. రెప్పపాటు కాలంలో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇక కొందరి తీరు చూస్తే చోరీలు చేయడంలో పీహెచ్జీ పట్టా తీసుకున్నారా అనే సందేహం వస్తుంది. ప్రపంచంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత కచ్చితంగా ఆశ్చర్యం కలుగకమానదు. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో ఓ మహిళ మెట్రో స్టేషన్‌లో చాలా వేగంగా దొంగతనం చేసి రెప్పపాటు కాలంలో అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఈ క్లిప్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ మెట్రో స్టేషన్ వద్ద నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. అప్పుడు అక్కడికి మెట్రో రైలు వస్తుంది. అందులో ఓ యువకుడు ఎక్కాడు. అతను డోర్ వద్దే నిలబడి ఉండి, ఫోన్ చూస్తుంటాడు. అతని తీరును గమనించిన మహిళ ఫోన్ కొట్టేసేందుకు అనువైన సమయం కోసం ఎదురు చూసింది. మెట్రో తలుపులు మూసుకునేటప్పుడు యువకుడి చేతిలో నుంచి ఫోన్ లాక్కొని పారిపోతుంది.
ఈ వీడియో @craziestlazy అనే ఖాతా ద్వారా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటివరకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆ యువకుడికి ఏమి జరిగిందో కూడా తెలియదు’. ‘ఇవన్నీ స్క్రిప్ట్.. మెట్రోల్లో ఇలా చేయడం సాధ్యం కాదని’, ‘ఇప్పుడు మెట్రోలో కూడా జాగ్రత్తగా ఉండాలి’ అని వ్యాఖ్యానిస్తున్నారు.