Video: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరంతే..!

Boy in Mud Puddle: ఏది ఏమైనప్పటికీ, పసివాడు ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా, చిరునవ్వుతో దొరకడం ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరమనే చెప్పాలి. డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి స్వచ్ఛమైన గ్రామీణ దృశ్యాలు నెటిజన్ల మనసుకు ఎంతో హాయిని ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Video: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరంతే..!
Child Found In Muddy Pond

Updated on: Jun 10, 2026 | 8:18 AM

Missing Child Found in Muddy Pond: కళ్లముందున్న బిడ్డ కాసేపు కనిపించకపోతేనే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది ఒక చిన్నారి గంటల తరబడి కనిపించకుండా పోతే ఆ కుటుంబం పడే నరకం అంతా ఇంతా కాదు. తాజాగా, ఒక గ్రామంలో గంటల తరబడి గాలించిన తర్వాత, ఒక చిన్నారి బురద గుంటలో పడుకుని నిద్రిస్తూ సురక్షితంగా దొరికిన విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

గంటల తరబడి గాలింపు.. చివరకు ఊహించని చోట..

సాధారణంగా పిల్లలు తప్పిపోతే బావులు, చెరువులు లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో వెతుకుతారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో, ఒక గ్రామానికి చెందిన చిన్నారి కొన్ని గంటల పాటు కనిపించకుండా పోయాడు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊరంతా జల్లెడ పట్టారు.

ఎంత వెతికినా జాడ దొరక్కపోవడంతో అందరిలోనూ ఆందోళన పెరిగిపోయింది. కానీ చివరకు ఆ బాలుడు ఎక్కడ దొరికాడంటే.. ఊరి చివర ఉన్న ఒక బురద గుంటలో! అవును, ఒళ్లంతా బురద అంటుకుని, నీటిలో సగం మునిగిపోయి ఉన్న ఒక గుంతలో ఆ చిన్నారి కనిపించాడు.

బురద పరుపుపై చిరునవ్వులు.. ఆందోళన కాస్తా నవ్వులుగా మారి..!

ఆ చిన్నారిని వెతుక్కుంటూ వెళ్లిన పెద్దలు, బాలుడు బురద నీటిలో పడుకుని ఉండడం చూసి ఒక్క క్షణం షాక్‌కు గురయ్యారు. బురద గుంటలో శవంలా కనిపించే సరికి అంతా ఆందోళనకు గురయ్యారు. ఎటువంటి కదలికలు లేకపోవడంతో కన్నీరు మున్నీరు పెట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఆ బురదలోకి దిగి బాలుడిని పైకి లాగాడు. అప్పటికి బాలుడి ముఖంలో ఎటువంటి చలనం కనిపించలేదు. అంతా కంగారు పుడుతూనే అసలేమైందంటూ చూస్తున్నారు. ఈ క్రమంలో ఒడ్డుకు చేరగానే ఆ బాలుడు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. జాలీగా నిద్ర నుంచి లేచినట్లు షాకిచ్చాడు. ఒక విలాసవంతమైన పరుపుపై పడుకున్నట్లు, ఆ బురద గుంటలోనే ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాడంట. అయితే, కోపం పట్టలేకపో సదరు యువకుడు బుడ్డోడి నెత్తిపై గట్టిగా ఒక్కటిచ్చి, గట్టిగా నవ్వేశాడు.

బురదలోంచి పైకి లాగుతున్నప్పుడు కూడా ఆ బాలుడు ఏమాత్రం కంగారు పడకుండా, నిద్ర లేచి ఏమీ ఎరగనట్లు సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బాలుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో, అంతసేపు పీక్ స్టేజ్‌కు చేరిన కుటుంబ సభ్యుల భయం పోయింది.

నెట్టింట నవ్వులు పూయిస్తోన్న బాలుడి సాహసం..

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అమాయకత్వం, వారి జీవన విధానం ఎంత సహజంగా ఉంటాయో చెప్పడానికి ఈ వీడియో ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియోను షేర్ చేసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో సందడి చేస్తున్నారు.

“ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన పరుపు కొన్నిసార్లు ఊహించని చోట దొరుకుతుంది” అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. “ఈ కాలం పిల్లలు బెడ్‌రూమ్‌లో ఏసీ వేస్తేనే పడుకుంటారు, కానీ ఈ బాబు టాలెంట్ చూస్తే ముచ్చటేస్తోంది” అని మరికొందరు నవ్వుకుంటున్నారు. దైవచింతన, గ్రామీణ సంస్కృతిని ఇష్టపడే నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us