ఓ అరుదైన సంఘటన జరిగింది. హనుమంతుడు కళ్లు ఆర్పడం కెమెరా కంటికి చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైనది. అంతేకాదు ప్రసిద్ది పుణ్యక్షేత్రాలలో ఒకటి కూడా. హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి భక్తులు వేలల్లో పోటెత్తుతారు. ఇదిలా ఉంటే.. ఈ ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
శనివారం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా హనుమంతుడు కళ్లు ఆర్పిన ఘటన కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. దీనిని అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా దేవుడి మహిమ అని భక్తులు, ఆలయ పూజారి చెబుతుండగా.. ఇలాంటి అద్భుతాలు కొత్తేమి కాదని స్థానికులు అంటున్నారు. అయితే ఇందులో వాస్తవికత ఇంకా తేలాల్సి ఉంది.
मध्यप्रदेश के खरगोन जिले के बडवाह के पास ओखला गांव में प्राचीन हनुमान मंदिर ओखलेश्वर धाम में रोहणी नक्षत्र में चोला श्रृंगार के दौरान हनुमानजी की मूर्ति की पलक झपकने का चमत्कार हुआ है।#जय_श्री_राम ??#जय_महावीर_हनुमान ?? pic.twitter.com/BgWZ2rKmeM
— Mahendra Singh (@anandshiva999) September 18, 2022