సోషల్ మీడియాను షేక్ చేస్తున్న‌ మైక్రోవేవ్ ఛాలెంజ్

| Edited By:

Mar 25, 2019 | 6:38 PM

మొన్న ఐస్ బకెట్ చాలెంజ్ సోషల్ మీడియాను దేశాధ్యక్షులతో సహా అందరినీ ఒక ఊపు ఊపితే, ఆ తర్వాత వచ్చిన కికి చాలెంజ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా యూత్ ను ఆకట్టుకుంది. ఇపుడు కొత్తగా మైక్రోవేవ్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవారు వాటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. సాధారణంగా మైక్రోవేవ్ అంటే ఎందుకు ఉపయోగిస్తారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆహార పదార్థాలను వేడి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. పైగా, ఇతరత్రా ఫుడ్ […]

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న‌ మైక్రోవేవ్ ఛాలెంజ్
Follow us on

మొన్న ఐస్ బకెట్ చాలెంజ్ సోషల్ మీడియాను దేశాధ్యక్షులతో సహా అందరినీ ఒక ఊపు ఊపితే, ఆ తర్వాత వచ్చిన కికి చాలెంజ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా యూత్ ను ఆకట్టుకుంది. ఇపుడు కొత్తగా మైక్రోవేవ్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవారు వాటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు.

సాధారణంగా మైక్రోవేవ్ అంటే ఎందుకు ఉపయోగిస్తారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆహార పదార్థాలను వేడి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. పైగా, ఇతరత్రా ఫుడ్ ఐటెమ్స్ అందులో నిల్వ ఉంచుతుంటారు. అయితే అందులో ఫుడ్ పెట్టిన తర్వాత అది తిరుగుతుంటుంటుంది.

మైక్రోవేవ్ ఓవెన్‌లో ఎలాగైతే తిరుగుతుందో.. అలాగే, మైక్రోవేవ్ ఛాలెంజ్‌లో తిరగాలన్నమాట. నేలపై కూర్చొని ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుని వాటితో రౌండ్‌గా తిరగాలి. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ జత చేసి షేర్ చేయాలి. ఫిబ్రవరి నెలలో టిక్ టాక్ యాప్‌లో ఒక యువకుడు ఇంగ్లీష్ ఆల్బమ్ ఒకటి ప్లేచేస్తూ నేలపై కూర్చొని తిరిగి వారి స్నేహితులకు మైక్రోవేవ్ చాలెంజ్ విసిరినప్పటి నుంచి ఇలా ఈ మైక్రోవేవ్ చాలెంజ్ వరుసగా ఒకరి నుంచి ఒకరికి పాకి వైరల్ అయి కూర్చుంది.