3 అడుగుల డాక్టర్‌ మహా ముదురు..! ఎంత ఉన్నామన్నది కాదు మ్యాటర్ అంటూ.. సర్కార్‌తో సవాల్‌ చేసి మరీ..

|

Mar 20, 2024 | 7:10 PM

గణేష్ ఓ రైతు కొడుకు. డాక్టర్ కావాలనే సంకల్పం, సవాళ్లను ఎదుర్కొనే పట్టుదల ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలను వదులుకోకుండా చేసింది. ఇంటర్న్ డాక్టర్‌గా పనిచేస్తూ వైద్యరంగం పట్ల తనకున్న తిరుగులేని నిబద్ధతతో ఇతరులకు స్ఫూర్తినిగా నిలిచారు. డాక్టర్ గణేష్ కథ పట్టుదల, శక్తి, మనిషి ధైర్యం, విజయానికి నిదర్శనంగా అంటున్నారు ఈ వార్త తెలిసిన చాలా మంది ప్రజలు.

3 అడుగుల డాక్టర్‌ మహా ముదురు..! ఎంత ఉన్నామన్నది కాదు మ్యాటర్ అంటూ.. సర్కార్‌తో సవాల్‌ చేసి మరీ..
3 Ft Doctor
Follow us on

ధైర్యం ఉంటేనే మనం చేరుకోవాల్సిన గమ్యానికి దారి బయటపడుతుందని అంటారు. గుజరాత్‌కు చెందిన 3 అడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బరయ్యకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రతి కష్టాన్ని అధిగమించి డాక్టర్‌ అయ్యి రోగులకు సేవలందించారు. అతని జీవితం పోరాటం, సంకల్పం అతని విజయానికి కారణంగా నిలిచాయి. కేవలం 3 అడుగుల ఎత్తుతో అతను బహుశా ప్రపంచంలోనే అతి చిన్న వైద్యుడుగా గుర్తించబడ్డారు. అతని జీవన పోరాటం పుట్టినప్పటి నుండే మొదలైంది. అయితే అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ బాగా చదివి ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించినా, ఎత్తు కారణంగా ఎంబీబీఎస్‌లో చేరలేదు. దాంతో గణేష్ పట్టు వదలకుండా సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో అతనికి న్యాయం జరిగింది. ఈ రోజు అతను గుజరాత్‌లోని భావ్‌నగర్ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా పని చేస్తున్నాడు.. అతను తన గురించి తాను గర్వపడుతున్నాడు. తన జీవితాన్ని తన రోగులకు సేవ చేయడానికి అంకితం చేస్తానని చెప్పాడు..

మీడియాతో డాక్టర్ గణేష్ ఏం చెప్పారు..?

ఇవి కూడా చదవండి

డాక్టర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ, తన ఎత్తు 3 అడుగులని అందువల్ల తాను అత్యవసర కేసులను నిర్వహించలేనని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీ నన్ను తిరస్కరించింది. కానీ ఆ తర్వాత భావ్‌నగర్ కలెక్టర్ సూచనలతో గుజరాత్ హైకోర్టుకు వెళ్లాను.. అక్కడ రెండు నెలల తర్వాత కేసు ఓడిపోయాం.. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి 2019లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్‌ తీసుకోవచ్చని 2018లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దాంతో ఇప్పుడు తాను డాక్టర్‌గా విజయం సాధించానని చెప్పాడు.

గణేష్ ఒక రైతు కొడుకు..

గణేష్ ఓ రైతు కొడుకు. డాక్టర్ కావాలనే సంకల్పం, సవాళ్లను ఎదుర్కొనే పట్టుదల ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలను వదులుకోకుండా చేసింది. ఇంటర్న్ డాక్టర్‌గా పనిచేస్తూ వైద్యరంగం పట్ల తనకున్న తిరుగులేని నిబద్ధతతో ఇతరులకు స్ఫూర్తినిగా నిలిచారు. డాక్టర్ గణేష్ కథ పట్టుదల, శక్తి, మనిషి ధైర్యం, విజయానికి నిదర్శనంగా అంటున్నారు ఈ వార్త తెలిసిన చాలా మంది ప్రజలు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..