
సరీసృపాలు అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా జనావాసాల్లోకి వస్తుండటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఓ చిన్న పాము పిల్లను దగ్గరగా చూశామంటేనే దడుసుకుని చస్తాం. అలాంటిది భారీ పైథాన్ మన దగ్గరలో ఉన్నట్లయితే.. ఇంకేముంది గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కొచ్చిలో చోటు చేసుకుంది. స్థానిక మహారాజా గవర్నమెంట్ కాలేజీ సమీపంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో ఉన్న చెట్టుపై తిష్ట వేసింది భారీ కొండచిలువ. సుమారు 10 గంటల పాటు కష్టపడి దాన్ని బంధించి సురక్షితంగా తరలించారు అధికారులు.
ఇది చదవండి: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే
వివరాల్లోకి వెళ్తే.. కొచ్చిలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మహారాజా గవర్నమెంట్ కాలేజీ సమీపంలోని హాస్టల్ కాంపౌండ్‌లో ఉన్న చెట్టు కొమ్మలపై ఓ భారీ పైథాన్ తిష్ట వేసింది. అటుగా వెళ్తున్న జనాలు దీన్ని గమనించడంతో ఉదయం 9 గంటలకు హైడ్రామా షూరూ అయింది. ఆ ప్రాంతమంతా దుకాణాలు, కార్యాలయాలు ఎక్కువగా ఉండటంతో విషయం తెలియగానే అందరూ ఒకింత భయభ్రాంతులకు గురయ్యారు.
అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక కౌన్సిలర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 30 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో భారీ పైథాన్ చెట్టు కొమ్మలపై ఉండటంతో.. చాలా జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా దాన్ని పట్టుకున్నారు. ఉదయం 9 గంటలకు మొదలుపెడితే.. రాత్రి 7.30 గంటలకు అనగా సుమారు 10 గంటల పాటు ఈ రక్షణ చర్యలు కొనసాగాయి. చివరికి దాన్ని మలయత్తూరు సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆ వీడియోపై మీరూ ఓసారి లుక్కేయండి మరి.
ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా