వింత వ్యాధితో బాధపడుతున్న యువతి.. రోటీ, అన్నం, ఆవాలు ఏమి తిన్నా మరణాన్ని ఆహ్వానించినట్లే..

|

Mar 30, 2024 | 10:03 AM

ఆహారం, నీరు లేకుండా  మానవులు కొన్ని రోజులు మాత్రమే జీవించగలుగుతారు. అన్నం, రోటీలు, కూరగాయలు వంటి అనేక ఆహార పదార్థాలను తింటారు. అయితే ఈ ఆహార పదార్థాలు కూడా ఎవరికైనా ప్రాణాంతకంగా మారతాయని ఎప్పుడైనా ఆలోచించారా.. అంటే అవును అని ఒక యువతి చెబుతోంది. పొరపాటున అన్నం లేదా రోటీ తింటే చనిపోయేంత వింత వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

వింత వ్యాధితో బాధపడుతున్న యువతి.. రోటీ, అన్నం, ఆవాలు ఏమి తిన్నా మరణాన్ని ఆహ్వానించినట్లే..
Allergic Woman
Follow us on

జీవించడానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో ప్రాణవాయువు కూడా అంతే అవసరం. ముఖ్యంగా ప్రాణవాయువు లేకుండా మనిషి ఒక్క క్షణం కూడా జీవించలేడు. అలాగే ఆహారం, నీరు కూడా అంతే అవసరం. ఆహారం, నీరు లేకుండా  మానవులు కొన్ని రోజులు మాత్రమే జీవించగలుగుతారు. అన్నం, రోటీలు, కూరగాయలు వంటి అనేక ఆహార పదార్థాలను తింటారు. అయితే ఈ ఆహార పదార్థాలు కూడా ఎవరికైనా ప్రాణాంతకంగా మారతాయని ఎప్పుడైనా ఆలోచించారా.. అంటే అవును అని ఒక యువతి చెబుతోంది. పొరపాటున అన్నం లేదా రోటీ తింటే చనిపోయేంత వింత వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

ఈ మహిళ పేరు కరోలిన్ క్రే. అమెరికాలోని మసాచుసెట్స్ నివాసి. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె  అరుదైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. దీని వలన అలెర్జీతో ఇబ్బంది పడుతుంది. అన్నం, రొట్టె లేదా ఆవాలతో చేసిన రోజువారీ పదార్థాలు తిన్న సరే ఆమె మరణిస్తుంది. 24 ఏళ్ల కరోలిన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌తో తన వింత సమస్య గురించి మాట్లాడుతూ.. తన డైట్ ఎలికేర్ (బేబీ ఫార్ములా బ్రాండ్), ఓట్‌మీల్ మాత్రమే అని చెప్పింది.

ఇవి కూడా చదవండి

వీటిని తినడం వల్ల అలర్జీ

అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆస్తమా, అలర్జీ అండ్ ఇమ్యునాలజీ ప్రకారం కరోలిన్ మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS)తో బాధపడుతోంది. ఇది అరుదైన రోగనిరోధక రుగ్మత.  ఈ వ్యాధి బారి పడిన వ్యక్తి పదేపదే తీవ్రమైన అలెర్జీ లక్షణాలతో ఇబ్బంది పడతాడు. అలెర్జీ కలిగించే ఎక్కువ వస్తువుల సుదీర్ఘ జాబితా కలిగి ఉంది. ఈ జాబితాలో బియ్యం, రొట్టె, చేపలు, వేరుశెనగలు, నువ్వులు, కివి, ఆవాలు, పిల్లి లేదా కుక్క బొచ్చు వంటివి అనేకం ఉన్నాయి. వీటిని తినడం వల్ల కరోలిన్ కు అనాఫిలాక్టిక్ షాక్ బారిన పడవచ్చు. ఇది ప్రాణాంతకమైన అలెర్జీ ప్రతిచర్య.

బతకాలంటే వీటిని మాత్రమే తినాలి

నివేదికల ప్రకారం ఈ వ్యాధి కరోలిన్‌ తినే అనేక పదార్ధాలకు దూరంగా ఉండేలా చేసింది. ఆమె రోజుకు మూడు సార్లు భోజనంగా గంజి, అమైనో ఆధారిత బేబీ ఫార్ములా తినాల్సి ఉంది. సెప్టెంబరు 2017లో ఐస్ క్రీం తిన్న తర్వాత అనాఫిలాక్టిక్ షాక్‌కు గురై 12 గంటల పాటు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కరోలిన్ ఈ వ్యాధి గురించి తెలుసుకుంది.  అదే నెలలో పిజ్జా, బ్రెడ్, రైస్, బీన్స్ తినడం వల్ల చాలాసార్లు షాక్‌కు గురై తీవ్రమైన అనారోగ్యంతో బాధపడింది. దీంతో ఆ యువతికి దాదాపు ప్రతి వస్తువుతో అలెర్జీ బారిన పడుతుందని తరువాత విద్య సిబ్బంది కనుగొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..