Viral Video: ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారును హెలికాప్టర్ గా మార్చిన బ్రదర్స్, వీడియో చూస్తే షాక్

|

Mar 19, 2024 | 9:05 AM

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు ఊరకనే అనలేదు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే.. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనో కానీ.. యూపీకి చెందిన బ్రదర్స్ కారును హెలికాప్టర్ గా మార్చి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారును హెలికాప్టర్ గా మార్చిన బ్రదర్స్, వీడియో చూస్తే షాక్
Helicopter
Follow us on

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు ఊరకనే అనలేదు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో.. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనో కానీ.. యూపీకి చెందిన బ్రదర్స్ ఓ కారును హెలికాప్టర్ గా మార్చి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యూపీలోని అంబేడ్కర్ నగర్ లో అన్నదమ్ముల అసాధారణ ప్రతిభ కనబర్చి ఈ ప్రాజెక్టును తయారు చేశారు. కారును అచ్చం హెలిక్టాపర్ గా మార్చేశారు. కారుపై రెక్కలు ఉండేలా.. వెనుక భాగంలో హెలిక్యాప్టర్ కు ఉండే తోక లాంటివి సెట్ చేసి వావ్ అనిపించారు. ఇక రంగులు కూడా హెలికాప్టర్ గా మాదిరిగా ఉండటంతో చూసినవాళ్లు షాక్ అయ్యారు.

అయితే దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ కారు హెలికాప్టర్ తో రోడ్లపై దూసుకుపోయారు. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే మోడిఫై చేసిన వాహనాన్ని సీజ్ చేసి షాక్ ఇచ్చారు. అయితే వినూత్న ఆవిష్కరణపై ఆనందానికి అవధులు లేకుండా పోతున్న సమయంలో పోలీసులు వాహనాన్ని సీజ్ చేశాడం నిరాశ కలిగించింది. సోషల్ మీడియాలో పోలీసుల అధికారులపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్స్ రియాక్ట్ అవుతూ..  స్వదేశీ ప్రతిభకు మద్దతు లేదని విచారం వ్యక్తం చేశారు.

మనదేశంలో చాలామంది ఇలాంటి వినూత్నమైన ఐడియాలతో దూసుకుపోతున్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్నారు. టాలెంట్ ఫుల్ ఉన్నప్పటికీ సరైన ఎంకరేజ్ లేకపోవడంతో ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో వెలుగులోకి రావడం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.