Viral Video: బైక్‌తో పాటు గాల్లో పల్టీలు కొట్టిన రేసర్.. షాకింగ్ వీడియో

నెట్టింట డైలీ రకారకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో పలు రకాల యాక్సిడెంట్ వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.

Viral Video: బైక్‌తో పాటు గాల్లో పల్టీలు కొట్టిన రేసర్.. షాకింగ్ వీడియో
Racer Accident

Updated on: Mar 21, 2022 | 2:01 PM

Trending Video: నెట్టింట డైలీ రకారకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో పలు రకాల యాక్సిడెంట్ వీడియోలు కూడా ఉంటాయి. ఇక బైక్ రేసింగ్స్ సమయంలో జరిగిన యాక్సిడెంట్ వీడియోలు కూడా ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. తాజాగా  బైక్‌ రేసింగ్‌(Bike Racing) ట్రాక్‌పై జరిగిన ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇండోనేషియన్‌ మోటోగ్రాండ్‌ ప్రీ తుదిపోరుకు ముందు మార్క్‌ అనే రేసర్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడు గాయపడ్డాడు. అయితే అతడు రేసింగ్‌ ట్రాక్‌పై స్కీడ్‌ అయి పడిన తీరు ప్రతి ఒక్కరినీ షాక్‌ గురి చేస్తోంది. బైక్‌తో పాటు గాల్లోనే పల్టీలు కొట్టాడు ఈ రేసర్. సెవన్త్‌ టర్న్‌ వద్ద.. బైక్‌ అదుపు తప్పడంతో.. పల్టీలు కొడుతూ గాల్లో ఎగిరిపడ్డాడు. బైక్ పార్ట్స్ కూడా చెల్లాచెదురు అయ్యాయి. అయితే, కిందపడిన వెంటనే తేరుకున్న మార్క్‌ పైకి లేచి నెమ్మదిగా నడిచి వస్తూ కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే రేసర్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేని కారణంగా ఆ యాక్సిడెంట్‌ అయిందని తెలుస్తోంది.

Also Read:  వల బలంగా అనిపిస్తే ఈ రోజు పండగే అనుకున్నారు.. తీరా బయటకు తీశాక అవాక్కు..

ఇంకా గృహప్రవేశం కూడా అవ్వని ఇంట్లో దొంగతనం.. ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే మైండ్ బ్లాంక్