బాస్ అంటే ఇలా ఉండాలి..! ఉద్యోగి సెలవు అడిగితే.. మేనేజర్ ఇచ్చిన రిప్లైకి నెటిజన్లు ఫిదా..!

ఆఫీసులో బాస్, ఉద్యోగి మధ్య సంభాషణ అంటే చాలామందికి వెంటనే పని ఒత్తిడి, సెలవుపై ప్రశ్నలు, వివరణలు, చివరికి ‘పని ఎవరు చేస్తారు?’ అనే మాటలు గుర్తుకొస్తాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రెడ్డిట్ పోస్టు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన అనుభవాన్ని చూపించింది. ఉద్యోగి అనారోగ్యంతో సెలవు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అనుమతి కోరితే.. బాస్ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా కేవలం ‘జాగ్రత్త’ అని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది.

బాస్ అంటే ఇలా ఉండాలి..! ఉద్యోగి సెలవు అడిగితే.. మేనేజర్ ఇచ్చిన రిప్లైకి నెటిజన్లు ఫిదా..!
Manager Shocks Employee Asked For Leave
Image Credit source: AI Image

Updated on: Aug 26, 2026 | 11:12 AM

ఆఫీసులో బాస్, ఉద్యోగి మధ్య సంభాషణ అంటే చాలామందికి వెంటనే పని ఒత్తిడి, సెలవుపై ప్రశ్నలు, వివరణలు, చివరికి ‘పని ఎవరు చేస్తారు?’ అనే మాటలు గుర్తుకొస్తాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రెడ్డిట్ పోస్టు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన అనుభవాన్ని చూపించింది. ఉద్యోగి అనారోగ్యంతో సెలవు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అనుమతి కోరితే.. బాస్ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా కేవలం ‘జాగ్రత్త’ అని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది.

r/IndianWorkplaceలో ఓ ఉద్యోగి తన బాస్‌తో జరిగిన వాట్సాప్ చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. సాధారణంగా ఈ కమ్యూనిటీలో విషపూరిత బాస్‌లు, అధిక పని ఒత్తిడి, సెలవుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల కథనాలు కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే తనకు ఎదురైన ‘బోరింగ్’ కానీ ఆరోగ్యకరమైన మేనేజర్-ఉద్యోగి సంభాషణలను కూడా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఓ చాట్‌లో ఉద్యోగి తన గొంతు కొంత మెరుగుపడిందని, అయితే రాత్రిపూట దగ్గు మళ్లీ పెరిగిందని బాస్‌కు వివరించాడు. అకస్మాత్తుగా WFH అడుగుతున్నందుకు క్షమాపణలు కూడా చెప్పాడు. దీనికి బాస్ స్పందన మాత్రం చాలా సింపుల్‌గా ఉంది. ‘సరే, అర్థమైంది. జాగ్రత్త’ అంటూ సమాధానమిచ్చారు. అనారోగ్యంపై ఎలాంటి అదనపు ప్రశ్నలు, వివరణలు అడగలేదు.

మరో సందర్భంలో ఉద్యోగి తనకు జ్వరం వచ్చిందని, మందులు తీసుకుని మరుసటి రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పగా.. బాస్ ‘జాగ్రత్త’ అని మాత్రమే స్పందించారు. మరో ఉద్యోగి కుటుంబ కార్యక్రమం తర్వాత నీరసంగా ఉందని, ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచి పనిచేస్తానని కోరగా.. ‘సరే, పర్వాలేదు’ అంటూ అనుమతించారు.

One from the manager’s side
by u/kaamchalau in IndianWorkplace

ఈ సాధారణ సంభాషణలే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మంచి మేనేజర్ అంటే ప్రతి చిన్న విషయానికీ ఉద్యోగిని ప్రశ్నించడం కాదని, ఉద్యోగి లేని సమయంలోనూ పని సజావుగా కొనసాగేలా సరైన వ్యవస్థలు, ప్రక్రియలు ఏర్పాటు చేయడమేనని పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యోగి సెలవు తీసుకుంటే టీమ్ పని ఆగిపోతే.. అది ఉద్యోగి తప్పు కాదని, మేనేజర్ ఏర్పాటు చేసిన వ్యవస్థలో లోపమని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి తన మాజీ కెనడియన్ బాస్‌ను ఉదాహరణగా చెబుతూ.. పని విషయంలో కఠినంగా ఉన్నప్పటికీ, ఆఫీస్ సమయం తర్వాత ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవించేవారని గుర్తుచేసుకున్నారు.

మొత్తానికి.. వైరల్ అయిన ఈ చాట్లు ‘మంచి బాస్ అంటే ఎలా ఉండాలి?’ అనే చర్చకు దారితీశాయి. ఉద్యోగులపై నమ్మకం, అవసరమైనప్పుడు సహకారం, వ్యక్తిగత సమయానికి గౌరవం ఉంటే పని వాతావరణం ఎంత ఆరోగ్యకరంగా మారుతుందో ఈ ఘటన మరోసారి చూపించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us