Viral Video: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరికొన్ని వీడియోలు చూస్తే మన కళ్లనే మనం నమ్మలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే, కొంతమంది మాత్రం తమను తాము నిరూపించుకోవటం కోసం పలురకాల స్టంట్స్ చేస్తుంటారు..తాజాగా అలాంటిదే ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఒక సర్దార్ జీ బైక్ డ్రైవ్ చేస్తున్న స్టైల్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదేం డ్రైవింగ్ రా బాబు.. ఏ మాత్రం భయంలేదు..అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…
సాధారణంగానే రోడ్డుపై వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడరాదని పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలా చేసిన వారిపట్ల ట్రాఫిక్ పోలీసులు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తుంటారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, ఫోన్ చూస్తూ డ్రైవ్ చేసేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడూ హెచ్చరిస్తునే ఉంటారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు తమ విధానం మార్చుకోరు. సోషల్ మీడియా లైకులు, షేర్ల కోసం పదే పదే అలాంటి స్టంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు.. రోడ్డుపై బైక్ డ్రైవ్ చేస్తూ..బైక్ హ్యాండిల్ విడిచిపెట్టాడు. అంతేకాదు..బైక్‌పై వన్‌సైడ్ కూర్చుని, కాలుమీద కాలు వేసుకుని సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు..ఇన్‌స్టా వేదికగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనం అవాక్కై చూస్తున్నారు. ఇదేం డ్రైవింగ్ రా బాబు.. అంటూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కిందపడిపోతానేమోననే భయం అతనిలో ఏ మాత్రం కనిపించటం లేదు..ఇక కొందరు మాత్రం అతడి బైక్‌ను దెయ్యం కంట్రోల్ చేస్తుందేమో అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.
ఈ క్లిప్‌ను రియల్‌కరంచావ్లా_ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వార్త రాసే సమయానికి 18 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ఒక వినియోగదారు, ‘సర్దార్ జీ చలాన్‌ని నేరుగా యమ్‌రాజ్ తీసివేస్తారు’ అని రాశారు. మరొక వినియోగదారు, ‘డ్రైవర్‌ని ఎడిటింగ్‌లో అదృశ్యం చేశారంటూ కామెంట్ చేశారు. ఇంకా చాలా మంది దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి