
సాధారణంగా బస్సులో కాస్త ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే.. వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్ తీసుకెళ్తాం. మధ్యలో ఎక్కడన్న బస్సు ఆపితే టీనో కాఫీనో తాగుతాం. అర్జెంట్ అయితే.. డ్రైవర్ సాబ్‌ను కాస్త బస్సు ఆపమని.. అలా రోడ్డు పక్కన కానిచ్చేస్తాం. సాధారణంగా ఎవరైనా ఇవే చేస్తుంటారు. కానీ, ఓ ప్రయాణికుడు మాత్రం ఎవరూ ఊహించని పని చేశాడు. లగ్జరీ స్లీపర్ క్లాస్ బస్సులో ఎంచక్కా షేవింగ్ క్రీమ్ రాసుకొని.. గడ్డం గీసుకున్నాడు. ఈ ఫన్నీ సీన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్సు అప్పర్ స్లీపర్ బెర్త్‌లో కూర్చోని, కిటికీ లోంచి తల బయటికి పెట్టి.. ప్రశాంతం షేవింగ్ చేసుకున్నాడు. ఈ దృశ్యాలను ఎవరో సెల్‌ఫోన్‌లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో వీడియోను మరింత వైరల్ చేసి పడేస్తున్నారు. కింద ఉన్న వీడియో చూసి.. మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి సరదాగా.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.