Trending Video: అమ్మ గురించి ఎంత అని చెప్పగలం.. ఏమని చెప్పగలం. బిడ్డలు పుట్టాక వాళ్లే తన సర్వస్వం అని బతుకుతుంది. వాళ్ల ఎదుగుదల గురించే నిరంతరం ఆలోచిస్తుంది. అమ్మ ప్రేమ అనంతం. ఆమె వాత్సల్యం దరి లేని సముద్రం. చదువులు, ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. తల్లులు మనసులో అల్లాడిపోతారు. రోజుకు 2,3 సార్లు ఫోన్లు చేసి మరీ బాగోగులు కనుక్కుంటారు. చేసిన ప్రతిసారి అమ్మ.. బిడ్డను అడిగే మొదటి మాట తిన్నావా అని. కొంతమంది పిల్లలు కూడా తమ పేరెంట్స్‌పై అంతే ప్రేమను కలిగి ఉంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 8 ఏళ్ల దూరంగా ఉన్న అనంతరం కొడుకు తన తల్లిని కలుసుకున్నాడు. ఈ వీడియో నెటిజన్లను బావోద్వేగానికి గురి చేస్తుంది. ఒక్కసారిగా తన తల్లిని చూడగానే ఒకింత ఆశ్చర్యానికి గురై… తల్లిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మదర్ కూడా ఎమోషన్‌కు లోనై ఏడ్చేసింది. ఆపై తల్లి నుదిడిపై ఏడుస్తూనే ముద్దు పెట్టాడు కొడుకు. గుడ్ న్యూస్ మూమెంట్ అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. చాలామంది తమ మదర్స్‌తో ఉన్న బాండింగ్ గురించి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..