Viral: గర్ల్‌ఫ్రెండ్ కోసం ట్రిక్స్ ప్లే చేశాడు.. కట్ చేస్తే.. అమ్మాయి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చింది!

కొందరు ప్రతీ పనిని శ్రద్ధగా ఆచితూచి చేస్తే.. మరికొందరు స్మార్ట్‌గా తమ వర్క్‌ను పూర్తి చేసేసుకుంటారు. ఇక్కడ ఓ యువకుడు కూడా అంతే.!

Viral: గర్ల్‌ఫ్రెండ్ కోసం ట్రిక్స్ ప్లే చేశాడు.. కట్ చేస్తే.. అమ్మాయి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చింది!
Viral
Follow us

|

Updated on: Jan 01, 2022 | 10:24 AM

కొందరికి ప్రతీ పని శ్రద్ధగా ఆచితూచి చేయడం అలవాటు.. మరికొందరు స్మార్ట్‌గా తమ వర్క్‌ను పూర్తి చేసేసుకుంటారు. ఇక్కడ ఓ యువకుడు కూడా అంతే.! 8 గంటల్లో చేయాల్సిన తన పనిని కేవలం 2 గంటల్లోనే పూర్తి చేశాడు. ట్రిక్స్ ప్లే చేశాడా.? లేక మేజిక్ చేశాడా.? అనేది పక్కన పెడితే.. ఇతడికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఆమెకు తన వర్క్ సీక్రెట్స్ అన్ని కూడా పంచుకున్నాడు. ఇక అది కాస్తా ఇతగాడి కొంప ముంచింది. బ్రేకప్ అనంతరం సదరు యువతి అతడి బాస్‌కు విషయాలన్నింటినీ చెప్పేసింది. ఇంతకీ ఆ కథేంటి.? ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..!

‘డేటాబేస్ ఎనలిస్ట్ అయిన ఓ వ్యక్తి తన పనిని కాస్తా అటోమేటెడ్ చేసుకున్నాడు. మొదటిగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌.. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలా ప్రతీ దాన్ని ఆటోమేటిక్ చేసి.. 8 గంటల్లో చేయాల్సిన పని.. కేవలం 2 గంటల్లోనే పూర్తి చేస్తూ వచ్చాడు. ఇక ఈ వ్యక్తికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఆమె కూడా అదే ఆఫీస్‌లో పని చేస్తోంది. ప్రియురాలికే కదా చెప్పేది అని.. తన వర్క్ సీక్రెట్స్ అన్ని కూడా ఈ మహానుభావుడు ఆమెతో పంచుకున్నాడు.’

కొంతకాలానికి వీరికి బ్రేకప్ అయింది. సరిగ్గా బ్రేకప్ జరిగిన రెండు రోజులకు ఆ వ్యక్తికి హెచ్‌ఆర్ వాళ్ల నుంచి పిలుపు వచ్చింది. ఆఫీస్ వేళలలో న్యూస్ పేపర్లు చదవడం, యూట్యూబ్ చూడటం, మొబైల్‌లో ఆడుకోవడం వంటి పనులు అతడు చేసినట్లుగా పలు స్క్రీన్‌షాట్స్ చూపిస్తూ.. ఎన్ని గంటలు పని చేశాడు.? ఎంత సమయం వృధా చేశాడు.? అనే విషయాలను కూడా ప్రస్తావించారు. క్రమశిక్షణా రాహిత్యం క్రింద చర్యలు తీసుకుంటున్నామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఎలాగోలా తన ఉద్యోగాన్ని కాపాడుకోగలిగాడు. ఇక ఇదంతా జరిగిన తర్వాత.. ‘తన కంప్యూటర్ ద్వారా ఈ విషయాలను అతడి మాజీ ప్రియురాలు బాస్‌కు అందజేసినట్లుగా తెలుసుకుంటాడు. చేసేదేమి లేక మరోసారి రిపీట్ కాక జాగ్రత్త పడుతున్నాడు’. కాగా, ఈ స్టోరీని అతడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకోగా.. అందరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అతడు చేసిన మోసాన్ని తప్పుపట్టగా.. మరికొందరు అతడి స్మార్ట్‌నెస్‌ను మెచ్చుకున్నారు.