Telugu News Trending Man Playing with Crocodile video was gone viral in Social Media Trending News
Viral Video: కుక్కలు పిల్లులతో ఆడుకోవడం చూశాం గానీ.. ఇతను మాత్రం ఏకంగా.. షాకింగ్ వీడియో
సాధారణంగా కుక్కలు, పిల్లులు ఇలా ఇంట్లో పెంచుకునే జంతువులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అయితే ఎవరైనా క్రూర మృగాలతో ఆడుకుంటారా.. వామ్మో వాటితో ఎవరైనా ఆడుకుంటారా.. వెంటనే అక్కడి నుంచి పారితారు అని అంటారా.. ఆగండాగండి....
సాధారణంగా కుక్కలు, పిల్లులు ఇలా ఇంట్లో పెంచుకునే జంతువులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అయితే ఎవరైనా క్రూర మృగాలతో ఆడుకుంటారా.. వామ్మో వాటితో ఎవరైనా ఆడుకుంటారా.. వెంటనే అక్కడి నుంచి పారితారు అని అంటారా.. ఆగండాగండి.. ఈ వీడియో చూశాక విషయం మీకే తెలుస్తుంది. మొసళ్లు (Crocodiles) చాలా ప్రశాతంగా నీటిలో తేలుతూ ఉంటాయి. అయితే అవి ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. అందుకే వాటి దగ్గరికి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా మొసలితో ఆడుకుంటున్నాడు. అంతే కాదు దానికి ఆహారం ఆశ చూపించి.. ఆట పట్టిస్టుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. కానీ ఆ మొసలి మాత్రం అతనికి ఏ మాత్రం హాని కలిగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి.. పడవపై కూర్చుని కాళ్లను కిందికి వేలాడేస్తూ మొసలిని ఆకర్షిస్తాడు. చేతిలో ఒక చిన్న మాంసం ముక్క పట్టుకుని మొసలిని పిలుస్తాడు. అది ఆహారం కోసం అతని వద్దకు వేగంగా వస్తుంది. కాసేపు మొసలితో ఆడుకున్న తర్వాత ఆహారం అందజేస్తాడు. అనంతరం మొసలి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఈ వీడియో చూస్తుంటే ప్రమాదకరమైన మొసలితో కాకుండా పెంపుడు కుక్కతో ప్రేమగా ఆడుకుంటున్నట్లు అనిపించిక మానదు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వేలాది మంది వ్యక్తులు వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.