సోషల్ మీడియాలో తరచూ అనేక వింతలూ-విశేషాలు ట్రెండ్ అవుతుంటాయి. కొన్ని అయితే ప్రపంచ మీడియాలో కూడా హల్చల్ చేస్తాయి. అందులో పలు వార్తలు మనకు ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. అసలు ఇలా కూడా జరుగుతుందా అనిపించేలా ఉంటాయి. ఇక అలాంటి కోవకు చెందిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఫేషియల్ రికగ్నైజేషన్.. ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు చిటికెలో యాప్స్‌లన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ఫీచర్ కొన్నిసార్లు మనల్ని చిక్కుల్లో కూడా పడేస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా చైనాలో చోటు చేసుకుంది. ఓ ప్రభుద్దుడు.. ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్‌ను వినియోగించి తన ప్రియురాలి బ్యాంక్ ఖాతాల నుంచి ఏకంగా రూ. 18 లక్షలను దోచుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. చైనాకు చెందిన ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ నిద్రపోతున్న సమయంలో ఆమె కనురెప్పలు తెరిచి ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్ ద్వారా తన ఫోన్‌ను వినియోగించాడు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి ఏకంగా 150,000 యువాన్(అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 18 లక్షలు)లను దోచేశాడు. మొదటిగా తన ప్రియురాలి వేలిముద్రలతో ఆమె బ్యాంక్ ఖాతాలకు చెందిన పాస్‌వర్డ్‌లను మార్చిన అతడు.. అనంతరం భారీ మొత్తంలో డబ్బులను లూటీ చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన సదరు యువతి ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, జూదంలో అప్పులపాలైపోవడంతో.. వాటిని తీర్చేందుకు ఈ పని చేశానని అతడు కోర్టు ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. దీనితో నానింగ్ జిల్లా పీపుల్స్ కోర్టు ప్రియురాలిని మోసం చేసినందుకు గానూ.. నిందితుడికి మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Also Read: