Viral Video: దిమాక్ ఉండాలే కానీ ఏదన్నా సాధ్యం.. ఏసీ లేకున్నా ఏసీ గాలి..

ప్రస్తుతం ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఉదయం 9 గంటలు అయ్యే సరికి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటోంది. ఎండ వేడికి చర్మం మండిపోతుంది. అంతలా ఎండలు ఈ సారి జనాలను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఏడాదికి ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఎండల బాధ భరించలేక చాలా మంది ఎయిర్ కూలర్లు, ఏసీలు కొనేస్తున్నారు. కానీ మధ్య తరగతి కుటుంబాలు..

Viral Video: దిమాక్ ఉండాలే కానీ ఏదన్నా సాధ్యం.. ఏసీ లేకున్నా ఏసీ గాలి..
Viral Video

Updated on: May 23, 2024 | 6:36 PM

ప్రస్తుతం ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఉదయం 9 గంటలు అయ్యే సరికి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటోంది. ఎండ వేడికి చర్మం మండిపోతుంది. అంతలా ఎండలు ఈ సారి జనాలను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఏడాదికి ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఎండల బాధ భరించలేక చాలా మంది ఎయిర్ కూలర్లు, ఏసీలు కొనేస్తున్నారు. కానీ మధ్య తరగతి కుటుంబాలు.. ఏసీ కొనాలంటే ఖష్టమే కదా. అలాగనే ఎండలను కూడా భరించలేరు. ఇలాంటప్పుడే వారిలోని టాలెంట్ అనేది బయట పడుతుంది. మండే ఎండలను భరించలేక ఓ వ్యక్తి చేసిన ప్రయత్నమే ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి జనాలు వావ్ వాటే ఐడియన్ సర్జీ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందుకే అంటారు. దిమాక్ ఉన్నోడు దునియాని ఏలుతాడు అని. మరి ఏసీ గాలి కోసం అతను ఏం చేశాడో చూద్దాం.

రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఎండల బాధ భరించలేక అతను సింపుల్‌గా ఇంట్లోనే ఏసీని తయారు చేశాడు. ఇందు కోసం అతను సాధారణ ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్, ఇటుకలు, వాటర్, టేబుల్ ఫ్యాన్ ఉపయోగించాడు. టేబుల్ ఫ్యాన్ ముందు ఒక ప్లాస్టిక్ టబ్‌లో ఇటుకలు పేర్చాడు. ఆ ఇటుకల మీద నిరంతరం నీరు సప్లై అయ్యేలా సెట్ చేశాడు.

ఫ్యాన్ గాలి ఇటుకల మీద నుండి వీస్తూ చల్లదనాన్ని ఇస్తోంది. ఇది గదిలోని వేడిని మొత్తం తగ్గించి చల్లబరుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను adpdeshpande అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ఏసీ తయారు చేసిన వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ఈ వీడియో మీరు కూడా చూసేయండి.