కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు తిరిగేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇందుకోసం కొన్ని చోట్ల ప్రత్యేకించి ఆన్‌లైన్‌లో పాస్‌లు జారీ చేస్తున్నారు. అయితే, పశ్చిమబెంగాల్‌లో లాక్‌డౌన్‌లో బయటకొచ్చిన ఓ వ్యక్తి పోలీసులే అవాక్కయ్యే అన్సర్ ఇచ్చాడు. వెస్ట్ బెంగాల్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి లాక్‌డౌన్‌లో స్వీట్లు కొనడానికి బయటకు వచ్చాడు. పైగా మెడలో ఓ బోర్డు కూడా వేసుకున్నాడు..దానిపై స్వీట్లు కొనడానికి వెళ్తున్నా అని రాసిపెట్టుకుని మరీ రోడ్డు మీద తిరుగుతున్నాడు. సదరు వ్యక్తిని గమనించిన పోలీసులు అతన్ని ఆపి రోడ్డు మీదకు ఎందుకు వచ్చావ్ అని సీరియస్‌గా అడిగారు. ఇందుకు అతను తన మెడలో బోర్డును చూపిస్తూ స్వీట్లు కొనడానికి వెళ్తున్నా అని చెప్పి..వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది నెటిజన్లు సైతం ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. బెంగాలీలకు స్వీట్స్ లేకుండా రోజు గడవడం చాలా కష్టమే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Only in #WestBengal: The note on the guy reads — ‘Going to buy sweets.’#Lockdown pic.twitter.com/84a63DdWU2
— Ananya Bhattacharya (@ananya116) May 17, 2021
Also Read: పెళ్లి కోసం ఆ వరుడు అడిగిన వరకట్నం ఏమిటో తెలుసా? తెలిస్తే నువ్వు మామూలోడివి కాదు బ్రో అంటారు!