Funny Video: వీడెవండీ బాబూ.. దొంగ నిలువుదోపిడీ చేస్తున్నా తేరగా తింటున్నాడు.. పైగా ఫోన్, డబ్బు పిలిచి మరీ ఇచ్చేశాడు..
Funny Video: మన ఇంట్లోనో, మన కళ్ల ముందో, చుట్టుపక్కనో దొంగలు దోచుకుంటుంటే ఏం చేస్తాం.. సాధ్యమైనంత వరకు పట్టుకుని, చితకబాదేందుకు ప్రయత్నిస్తాం.

Funny Video: మన ఇంట్లోనో, మన కళ్ల ముందో, చుట్టుపక్కనో దొంగలు దోచుకుంటుంటే ఏం చేస్తాం.. సాధ్యమైనంత వరకు పట్టుకుని, చితకబాదేందుకు ప్రయత్నిస్తాం. లేదంటే.. దొంగ దొంగా అని అరిచి వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తాం. అదీ కాదంటే.. వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తాం. పరిస్థితి బాలేకపోతే.. దొంగ తన పని తాను చేసుకుని వెళ్లిపోయేవంత వరకు బిక్కు బిక్కుమంటూ కూర్చుంటారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ అని నెటిజన్లు స్టన్ అవుతున్నారు. దునియాలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతున్నారు. నిజంగా చెప్పాలంటే.. ఇలాంటి వారు ఉంటే దొంగలకు పెద్దగా కష్టపడాల్సిన పనే ఉండదు. అవును మరి.. వీడియో చూస్తే సీన్ మీకే అర్థం అవుతుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రెస్టారెంట్‌లోకి దోపిడీ చొరబడ్డాడు. గన్‌తో బెదిరిస్తూ రెస్టారెంట్ కౌంటర్‌లో క్యాషియర్‌ను బెదిరించాడు. రెస్టారెంట్‌లో కొందరు కపుల్స్ కూడా ఉన్నారు. వారిని కూడా దోచుకున్నాడుు దొంగ. వారికి గన్ చూపుతూ.. నిలువుగా దోచుకున్నాడు. మెడలో చైన్, జేబుల్లో డబ్బు అన్నీ తీసుకుంటున్నాడు దొంగ. కానీ, బాదిత వ్యక్తి మాత్రం అసలు దోపిడీనే జరుగడం లేదన్నట్లుగా.. విచిత్రంగా ప్రవర్తించాడు. దొంగ దోచుకుంటుంటే.. అతను మాత్రం తాపీగా కూర్చుని తింటున్నాడు. అంతటితో ఆగకుండా.. దొంగ వెళ్లిపోతుంటే వెనక్కి పిలిచి మరీ తన జేబులోని సెల్ ఫోన్‌ను ఇచ్చేశాడు. ఈ షాకింగ్ సీన్ అంతా రెస్టారెంట్‌లో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓవైపు లూటీ చేస్తుంటే.. అదేమీ పట్టించుకోకుండా తినుకుంటూ కూర్చోవడం ఏంటి సామీ అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.




My man casually just kept eating his wings as he was getting robbed ? pic.twitter.com/HMz9cHTluB
— Daily Loud (@DailyLoud) September 19, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
