Portugese Man: కృషి, పట్టుదల, చేపట్టిన పని ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేసి తీరాలనే సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ వ్యక్తి రుజువు చేశాడు. సొంతంగా హెలికాఫ్టర్‌ను తయారుచేసుకోవాలన్న అతని కలను నిజం చేసుకున్నాడు. సంకల్పం ఉంటే సరిపోదు.. అందుకు తగిన ప్రయత్నం పట్టుదల కూడా ఉండాలి. అతని పట్టుదల, సంకల్ప బలం వెరసి పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే సాధ్యమనుకునే హెలికాఫ్టర్‌ను సొంతంగా తయారు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
యూరప్‌లోని పోర్చుగీసుకు చెందిన ఓ వ్యక్తి ఈ హెలీకాఫ్టర్‌ను తయారు చేసాడు. పాత కార్లకు చెందిన విడి భాగాలతో అతను హెలికాప్టర్ తయారు చేశాడు. వోక్స్‌వాగన్ బీటిల్ కారు ఇంజిన్‌ను హెలికాఫ్టర్‌కు ఇంజిన్‌గా వాడాడు . కార్ల విడి భాగాలతో హెలికాఫ్టర్ లుక్ వచ్చేలా ఆయా విడి భాగాలను తయారు చేసి, వాటన్నింటినీ నట్లు, బోల్టులతో సెట్ చేశాడు. హెలికాఫ్టర్‌పైన ఉండే పెద్ద ఫ్యాన్ కోసం భారీ రెక్కలు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దాన్ని రోడ్డుపైకి తెచ్చి… ప్రయోగించి చూశాడు. రన్‌వేపైన అరకిలోమీటర్ వెళ్లిన హెలికాప్టర్ ఆ తర్వాత గాల్లోకి లేచింది. ఒరిజినల్ హెలికాప్టర్ లాగానే పైకి ఎగిరింది. దాంతో అతని కల ఫలించింది.. గాల్లో తేలిన హెలికాప్టర్‌ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏదో ప్రయత్నిస్తున్నాడు గానీ ఇదంతా అయ్యే పని కాదులే” అనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడీ హెలికాప్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 9న ట్విట్టర్‌లోని @MendesOnca అకౌంట్‌లో ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను చూస్తున్న లక్షలమంది నెటిజన్లు ఆవ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది యూరప్ లోని పోర్చుగీస్‌లో జరిగినట్లు తెలిసింది.
హెలికాఫ్టర్‌పై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..
Homem no interior do RN constrói helicóptero com restos de carros e motor de fusca, faz teste e decola. pic.twitter.com/4zpS1jvy9p
— Меndes (@MendesOnca) December 9, 2021
Also Read: