Viral video: డీప్ డైవ్ చేద్దాం అనుకున్నాడు డిక్కీ డ్యామేజ్ అయ్యింది.. నవ్వులు పూయిస్తున్న వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఫన్నీ వీడియోలే ఎక్కువ.. కొన్నిసార్లు మనుషులు చేసే వింత వింత పనులు నెట్టింట నవ్వులు పూయిస్తాయి.

Viral video: డీప్ డైవ్ చేద్దాం అనుకున్నాడు డిక్కీ డ్యామేజ్ అయ్యింది.. నవ్వులు పూయిస్తున్న వీడియో
Viral Video

Updated on: Sep 19, 2022 | 12:19 PM

Viral video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఫన్నీ వీడియోలే ఎక్కువ.. కొన్నిసార్లు మనుషులు చేసే వింత వింత పనులు నెట్టింట నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. కొంతమంది సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోవాలని.. లైకులు కోసం రకరాల సాహసాలు చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు అవి బెడిసి కొడుతూ ఉంటాయి. ఇలా పాపులారిటీ కోసం ప్రాకులాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వారుకూడా ఉన్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా అదే ట్రై చేశాడు కానీ సీన్ రివర్స్ అయ్యింది.

నలుగురి ముందు తమ టాలెంట్‌ని నిరూపించుకోవాలని సరదాపడే వాళ్లలో మనోడు కూడా ఒకడు. ఏకంగా న నదిలోకి వెరైటీగా దూకి ఫేమస్ అవ్వాలని ట్రై చేశాడు. కానీ ఊహించని సీన్ జరిగింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నదిలోకి దూకడానికి ప్రయత్నించాడు. బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకాడు. కానీ నదిలో లోతు లేకపోవడంతో అతడికి దెబ్బతగిలింది. డైవింగ్ స్కిల్స్ చూపించేందుకు ట్రై చేశాడు కానీ ఊహించని ట్విస్ట్ ఉండటంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ దక్కించుకుంది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి