మనుషులు బర్త్ డేస్ చేసుకోవడం చూశాం.. పెట్స్‌కి బర్త్ డేస్ చేయడం చూశాం.. చెట్లకు కూడా పుట్టినరోజులు జరిపిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం.. ఓ వ్యక్తి తన బైక్‌కు బర్త్ డే చేశాడు. ఏకంగా బైక్‌తో కేక్ కట్ చేయించాడు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. అందుకోసం ఆ వ్యక్తి.. బైక్ నీట్‌గా కడిగి ఓ పూల దండ వేశాడు. ఇంట్లో వాళ్లని.. ఇరుగు పొరుగు వారిని బైక్ బర్త్ డే వేడుకకు పిలిచాడు. ఈ సమయంలో ఓ వ్యక్తి బైక్ ముందు కేక్ పట్టుకోగా.. మరో వ్యక్తి.. ముందు టైర్‌కు కత్తి కట్టి ముందుకు నడిపించాడు. శివమూర్తి3893 అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి ఓ రేంజ్‌లో వ్యూస్ వస్తున్నాయి.
వీడియో దిగువన చూడండి…
“పెట్రోల్ ట్యాంక్ తెరిచి అందులో కొవ్వొత్తి వెలిగించండి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుకున్న బైక్‌పై ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. ఇందులో నవ్వడానికి ఏం లేదు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “మగవాళ్లు సరిగ్గా ప్రేమించలేరు అని ఆడోళ్లు అంటుంటారు.. అలాంటివారు ఈ వీడియో చూడండి” అని మరో యూజర్ పేర్కొన్నాడు. కొందరు సరదాగా బైక్‌కు హ్యాపీ బర్త్ డే అని చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..