సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలలా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమైపోతోంది. సాధారణంగా పాములను చూస్తే మన వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది భారీ కింగ్ కోబ్రాను దగ్గర నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.? అంతే సంగతులు పైప్రాణం పైనుంచే పోతుంది. అంతటి డేంజరస్ అయిన కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పార్క్ లాంటి ప్రదేశంలో సంచరిస్తున్న సుమారు 14 అడుగులు పొడవున్న భారీ కొండచిలువను చాకచక్యంగా క్షణాల్లో ఒట్టి చేతులతో పట్టేసుకుని స్థానికులను ఆశ్చర్యపరిచాడు. దాన్ని పట్టుకునే క్రమంలో కింగ్ కోబ్రా తల పైకెత్తి కాటు వేసేందుకు ముందుకు వచ్చినా.. ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాడు. ఈ ఘటన దక్షిణ థాయ్ ప్రావిన్స్ కాబ్రీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ఇప్పటిదాకా ఇది 6900 వ్యూస్, 116 లైక్స్ రాబట్టుకుంది. ఇదిలా ఉంటే.. కింగ్ కోబ్రా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము. దాదాపు 10 నుంచి 13 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో తరచుగా కనిపిస్తుంటాయి.